ఈ మధ్య పెండ్లి కోసం ఎన్ని మోసాలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం.మోసగాళ్లు నానా రకాల వేశాలు వేస్తూ చివరకు అమ్మాయిలను మోసం చేస్తూనే ఉన్నారు.
ఇక ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఎన్నో వార్తలు, విషయాలు చూస్తున్నా వారు మాత్రం అలర్ట్ కావట్లేదు.ఇదే అదునుగా చేసుకుని కేటుగాళ్లు మంచిగా మాట్లాడుతూనే మాయ చేస్తున్నారు.
కొన్ని సార్లు అయితే పెండ్లి పీఠల మీద ఇలాంటి మోసాలు బయటపడటంతో ఆగిపోయినవి కూడా ఉన్నాయి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘటన గురించే మనం మాట్లాడుకోబోయేది.
ఓ ప్రబుధ్దుడు తనకు వివాహమైన విషయం దాచిపెట్టి మరీ ఇంకో యువతిని మోసం చేయడానికి రెడీ అయిపోయాడు.ఇక ఆమెతో అన్ని అనుకున్నట్టుగానే ప్లాన్ చేసుకుని రెండో పెళ్లికి సిద్ధమైన ఆ యువకుడు.
ఈయన వేసిన ప్లాన్ అయితే ఏకంగా సినీ ఫక్కీలోనే ఉందనే చెప్పాలి.కాగా ఇక్కడే ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి.కాగా ఆయన ప్లాన్లు రివర్స్ అయ్యి చివరి నిమిషంలో అతడి గట్టురట్టు అయి చివరకు దొరికిపోయాడు.ఇక ఆయన పెండ్లి పీటల దగ్గరి నుంచి పారిపోయి చివరకు పరారీలో ఉన్నాడు.

అరుంబాక్కంకు చెందిన రాయన్ అనే ఈ కేటుగాడికి ఇప్పటికే పెండ్లి అయి పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది.కానీ ఈ విషయాన్ని దాచిపెట్టి ఆవడికి చెందిన మరో యువతిని పెండ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు.ఆ అమ్మాయికి అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లికాలేదని నమ్మించి ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు.ఇక ఆ యువతి కూడా అతగాడిని నమ్మి పెండ్లికి రెడీ అయిపోయింది.ఇక చివరకు పెళ్లి సమయానికి ఆ కేటుగాడికి పెళ్లయినట్టు యువతికి తెలిసిపోయింది.అయితే ఆమె అడగ్గా తనలాగే ఉండే తన అన్నను చూసి మోసపోయారని, తాను కాదని నమ్మపలికాడు.
కానీ ఇక గ్రాఫిక్స్ ద్వారా అన్న పెళ్లిలో తాను ఉంటున్నట్టు ఇద్దరున్నట్టు మార్పింగ్ ఫొటో చూపించాడు.కానీ యువతి బంధువు ఒకరు ఆయన మోసాన్ని ఆధారాలతో బయట పెట్టడంతో అతగాడు కాస్త పారిపోయాడు.