త‌న‌ను తానే తినేస్తున్న పాము.. వీడియో చూస్తే హ‌డ‌ల్‌

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.పాముకు సంబంధించిన ఓ యూనిక్ వీడియో ప్రజెంట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

 The Snake That Eats Itself Viral Video, Snake, Viral Video, Snake Eats Itself,-TeluguStop.com

సదరు వీడియోలో పాము తనను తానే తినేస్తోంది.అది చూసి నెటిజన్లు హడలిపోతున్నారు.

ఇంతకీ పాము ఎందుకు అలా తనను తింటున్నదంటే.

సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న సదరు వీడియోలో మచ్చలున్న కింగ్ స్నేక్.

తనను తానే తింటోంది.ఈ స్నేక్ ఓనర్ రాబ్ వెనిటాక్స్ ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

దాని వెనుక భాగాన్ని తానే తింటు ఉండగా, అది రికార్డు చేశాడు.అలా పాము తన శరీరంలోని సగం కంటే ఎక్కువ భాగాన్ని మింగేసింది.

ఈ క్రమంలోనే పామును రక్షించేందుకుగాను దాని తలపైన శానిటైజర్ ను పూశాడు.అలా శానిటైజర్ పూయగానే పాము తన నోటిలో ఉన్న తన శరీరాన్ని విడిచిపెట్టేసింది.

ఎందుకంటే పాముకు శానిటైజర్ స్మెల్ అస్సలు పడదు.అలా శానిటైజర్ యూజ్ చేసి దానిని రక్షించాడు.

పాములు  శానిటైజర్ ను చూస్తే హడలిపోతుంటాయి.వాటి వాసన వలన పాములు ఇబ్బందులు పడుతుంటాయట.ఇకపోతే పాములు  ఇలా తమను తాము తినడానికి గల కారణాలు వివరించారు.రాజు పాములు ఇతర పాములను తింటుంటాయి.కానీ, కొన్ని పరిస్థితులను తమను తాము కూడా తింటుంటాయి.ఒత్తిడి లేదా టెంపరేచర్‌ను తట్టుకునేందుకుగాను లేదా తమ ఆకలిని తామే తీర్చుకునేందుకుగాను ఇలా పాములు తమను తాము తినేస్తుంటాయి.

పాముపైన శానిటైజర్ పూసి తనను రక్షించిన ఓనర్ కు ఈ సందర్భంగా నెటిజన్లు థాంక్స్ చెప్తున్నారు.ఇలా పాము తనను తాను తింటుండం చూస్తుంటే భయమేస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ వీడియోకు సోషల్ మీడియాలో బోలెడన్ని వ్యూస్ లభిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube