మనకు తెలిసినంత వరకు వెనకటి నుంచి ఒక సామెత ఉంది.పాములు పగబడుతాయనే ప్రచారాన్ని ఇప్పటికీ గ్రామాల్లో నమ్ముతూనే ఉంటారు.
అందుకే ముఖ్యంగా నాగుపామలు జోలికి అస్సలు పోరు.ఎందుకంటే దానికి ఏదైనా జరిగితే చివరకు అది కుటుంబం మీద పగబడుతుందని పెద్ద నమ్మకం.
ఇక పాము అనే విషయానికి వస్తే మాత్రం దాన్ని చూస్తేనే ఆమడ దూరం పరుగులు పెడుతుంటాం.ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు చేసినా దాని కాటుకు ప్రాణాలు అర్పించాల్సి వస్తుంది.
ఇకపోతే ఇప్పుడు ఓ పాము పగబట్టినట్టే చేసింది.
ఆ కుటుంబం మీద ఆ పాము ఏదో గట్టి పగ ఉన్నట్టు రాత్రి పూట వచ్చి కుటుంబం మొత్తాన్ని కాటేసింది.
ఈ ఉదంతంలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడువగా ఇంటి పెద్దలు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు.అచ్చం సినిమాలో లాగా జరిగిన ఈ ఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుందని తెలుస్తోంది.
ఈ మున్సిపాలిటీలోని శనిగపురం ఏరియాలో నివాసం ఉంటున్నటువంటి క్రాంతి, మమత దంపతులతో ఓ కూతురు కూడా ఉంది.వారంతా కలిసి రోజు లాగే తమ ఇంట్లో పాపతో కలిసి పడుకున్నారు.

అయితే ఇంట్లోకి ఎలా వచ్చిందో ఏమో తెలీదు గానీ ఓ పాము వారు పడుకున్న ప్లేస్ లోకి వచ్చింది.ఇక వస్తూనే చిన్న పాపను ఆ తర్వాత తల్లిదండ్రులను కాటేసింది.దీంతో వారంతా అలర్ట్ అయిపోయి పెద్ద ఎత్తున అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చారు.ఇక వారు పామును చంపేసి తల్లిదండ్రులను ఆస్పత్రిలో చేర్పించారు.చిన్నారి మాత్రం కరిచిన వెంటనే ప్రాణాలు విడిచింది.ఇక పెద్దలు మాత్రం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
వారి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం.ఈఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.