టీడీపీలో ఆ మాజీ మంత్రి ప‌రిస్థితి దారుణం.. ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లే..

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రి ఫేట్ ఎలా మారుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు.త‌మ‌కు ఎదురు లేద‌నుకున్న వారికి స‌డెన్ షాక్‌లు కూడా త‌గులుతుంటాయి.

 The Situation Of The Former Minister In The Tdp Is Bad No One Cares .akhila Priy-TeluguStop.com

ఇక‌పోతే ఇప్పుడు టీడీపీలో ఓ మాజీ మంత్రిప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది.ఒక‌ప్పుడు మంత్రిగా ఉండి జిల్లాలో చ‌క్రం తిప్పిన ఆ మ‌హిళానేత ఇప్పుడు ఇంటి పోరుతోనే స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ఆమెనే భూమా నాగిరెడ్డి కూతురు అయిన భూమా అఖిల ప్రియ.కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీదీ చెర‌గ‌ని ముద్ర‌.

ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటుగా నంద్యాల నియోజకవర్గాన్ని ఒంటిచేతితో ఏలిన‌చ‌రిత్ర ఈ ఫ్యామిలీది.

చంద్రబాబు ప్ర‌భుత్వ హయాంలో అఖిల ప్రియ చాలా చిన్న వ‌య‌సులోనే మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు.

అయితే ఆ త‌ర్వాత పార్టీ పరంగా ఇటు వ్య‌క్తిగ‌తంగా అధికారం కోల్పోయినా కూడా ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌కుండా జగన్ ప్రభుత్వ వైఫల్యాల మీద అలాగే అక్రమ గ్రావెల్ తవ్వకాల మీద బాగానే పోరు సాగించారు అఖిల ప్రియ‌.ఎప్ప‌టిక‌ప్పుడు మాటల తూటాలతో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలే ప‌డేసేలా పోరాడారు.

అయితే హైదరాబాద్‌లో కేసీఆర్ బంధువుల కిడ్నాప్ ఉదంతం ఆమె మెడ‌కు చుట్టుకుంది.

Telugu Aallagadda, Akhila Priya, Ap, Bhuma, Chandra Babu, Cm Jagan, Nandyala, Ys

దీంతో పాటు సొంత కుటుంబంలో ఆమెకు పోటీగా మారిన టికెట్ల రగడ తీవ్ర ఇబ్బందులు పెట్టింది.మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి విష‌యంలో అఖిలకు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి.త‌న సొంత సోదరుడు అయిన జగద్ విఖ్యాత్ రెడ్డిని ఈ సారి ఎన్నిక‌ల్లో పోటీ చేయించాల‌ని అఖిల చూడ‌టంతో బ్రహ్మానంద రెడ్డి ఆమెను ప‌ట్టించుకోవ‌ట్లేదు.ఇంకోవైపు మరో ఫ్యామిలీ మెంబర్ అయిన సీనియ‌ర్ నేత ప్ర‌స్తుతం బీజేపీలో చేరి అఖిల‌ను టార్గెట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఏవీ సుబ్బారెడ్డి ఆమెకు పోటీగా ఎదుగుతుండ‌టంతో చంద్ర‌బాబు నాయుడు అఖిలను దాదాపు పక్కన పెడుతున్నార‌ని అంటున్నారు.ఇలా ఎటు చూసినా ఆమెకు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube