ఆ సింగర్‌కు తల పొగరు, అహంభావి అంటూ ప్రచారం.. కానీ అసలు నిజం ఏమిటంటే?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు, దర్శకనిర్మాతలకు, సింగర్ లకు ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో విమర్శలు వస్తుంటాయి.ఎందుకంటే సెలబ్రేటి హోదాను మోస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఎదుర్కోకుండా ఉండరు అని చెప్పాలి.

 The Singer Arrogant But What Is The Real Truth-TeluguStop.com

ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.ఇక ఓ సింగర్ కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంది.

తనను తలపొగరు అంటూ, అహంభావి అంటూ ఎన్నో ప్రచారాలు చేశారు.ఇంతకీ ఆ సింగర్ ఎవరో కాదు.

 The Singer Arrogant But What Is The Real Truth-ఆ సింగర్‌కు తల పొగరు, అహంభావి అంటూ ప్రచారం.. కానీ అసలు నిజం ఏమిటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ స్మిత. మొట్టమొదటిగా పాప్ ఆల్బమ్ ను రూపొందించింది.ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్మిత తను చదువుకుంటున్న సమయంలోనే సంగీతంపై ఆసక్తి ఉండటంతో అప్పటి నుండే పలు కార్యక్రమంలో పాల్గొన్నది.ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమైన పాడుతా తీయగా అనే షోలో కూడా పాల్గొని తన పాటలతో బాగా ఆకట్టుకుంది.

ఫైనల్ లో మాత్రం విజేతగా నిలవలేకపోయింది.కానీ తన పాటలతో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక అప్పటికే పలు సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.తన తల్లిదండ్రులు ఆమె గొంతు పాప్ సంగీతానికి బాగా సెట్ అవుతుందని ఇక ఆమెను అందులో మరింత కృషి చేయమని సలహా ఇచ్చారట.

అదే సమయంలో హాయ్ రబ్బా అనే ఆల్బమ్ ను చేసిందట.ఈ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకోగా ఆ తర్వాత పలు ఆల్బమ్స్ లలో అవకాశాలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది.తెలుగులో పాత పాటలను రీమిక్స్ చేసి బాగా ఆకట్టుకుంది.

పలు షో లలో కూడా పాల్గొని తన పాటలను ప్రేక్షకులకు వినిపిస్తుంది.ఇక ఈమెకు గాయనిగానే కాకుండా నర్తకి కూడా చేసింది.అంతే కాకుండా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టింది స్మిత.హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో 2002 సంవత్సరంలో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ పేరుతో ఓ బ్యూటీ సెలూన్ ప్రారంభించిందట.

ఆ తర్వాత తన బిజినెస్ మరింత సాగడంతో 2006లో విజయవాడలో కూడా ఈ సెలూన్ ను ప్రారంభించిందట.వీటితో పాటు ఓ ఫిట్ నెస్ సెంటర్ కూడా ప్రారంభించిందని తెలిసింది.

అంతేకాకుండా తన సొంతంగా ఐ కాండీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఓ సంస్థను ప్రారంభించి అందులో పలు టీవీ షోలను చేస్తుందని తెలిసింది.ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్మిత తనను విమర్శించిన వాళ్ల గురించి స్పందించింది.

తనను తల పొగరు అన్నారని, అహంభావి అంటూ విమర్శించారని ఇందులో ఎంతవరకు నిజం ఉందని ప్రశ్నించగా.తనకు బాగా తెలిసిన వారైతే అలా అనుకోరు అని తెలిపింది.

Telugu Arrogant, Singer, Smita, Tollywood, Touted-Movie

ఒకవేళ తనను అనవసరంగా ఇబ్బందులు పెడితే మాత్రం తనకు ఎక్కడలేని తిక్క వస్తుందని మండిపడింది.ఎవరినైనా వయసు బట్టి కాకుండా ప్రవర్తన బట్టి గౌరవిస్తాం అంటూ అందరితో తను కూడా గౌరవంగా ఉంటుందని తెలిపింది.ఇక తనకు అవకాశం ఇవ్వండి అని అడగక పోవడం వల్లే మీ అందరి ఉద్దేశంలో నాకు తల పొగరు అని అనిపిస్తే మాత్రం సరే అంటూ ఇక్కడ ఎవరికి ఎవరు తక్కువ కాదు.ఎక్కువ కాదు అంతే కానీ పరిస్థితులను బట్టి మారాల్సి ఉంటుంది అని తెలిపింది స్మిత.

#Arrogant #Smita

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు