ముత్తైదువుల‌కు తాంబూలం ఇచ్చేట‌ప్పుడు అందులో ఏఏ వ‌స్తువులు ఉండాలో తెలుసా     2017-07-01   22:55:37  IST  Raghu V

సాధారణంగా మహిళలు ఎక్కువగా తడిలో తిరుగుతూ ఉంటారు. దాంతో దగ్గు,జలుబు మరియు గొంతు సంబంధమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అందువల్ల కాళ్లకు పసుపు రాసుకోవాలి. మరొకటి తాంబులం. తాంబులం వేసుకుంటే నాలుక మీద ఉన్న చిన్న చిన్న బొడిపెల రిషి గుణాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది. తమలపాకులో సున్నం,వక్క కలిపి తింటే నాలుకకు సంబందించిన సమస్యలు తగ్గుతాయి.

తమలపాకులో 13 రకాల వ్యాధులను తగ్గించే గుణాలు ఉన్నాయి. అందువల్ల మన పెద్దవారు ముత్తైదువుల‌కు తాంబూలం ఇచ్చే సమయంలో కాళ్లకు పసుపు రాసి తాంబులంలో ఆకు, వ‌క్క, సున్నం మ‌రియు రెండు అర‌టిపండ్లు, పూలు మ‌రియు జాకెట్టు ఉండేలా చూసుకోవాలని చెప్పుతారు. తాంబూలం ఇచ్చేట‌ప్పుడు వారికి కుంకుమ బొట్టు పెడుతూ తాంబూలం వారికి ఇవ్వాలి. ఏది ఏమైనా మన పెద్దలు చెప్పిన విషయాలలో సంప్రదాయం మరియు ఆరోగ్యం దాగి ఉంటుందని గ్రహించాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.