షాకింగ్ న్యూస్.. హీరో సూర్యని కొడితే లక్ష రూపాయిలు బంపర్ ఆఫర్?

ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరోలపై వరుస దాడులు జరుగుతున్నాయి.గత కొద్ది రోజుల క్రితం విజయ్ సేతుపతి బెంగళూరు ఎయిర్ పోర్టులో ఒక గుర్తు తెలియని వ్యక్తి అతనిపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

 One Lakh Rewar For Who Beat Hero Surya Says Pmk Leader Details, Suya, Tollywoo-TeluguStop.com

అయితే ఆ వ్యక్తి తాగి ఉన్నాడని ఇది కేవలం చిన్న సంఘటన మాత్రమే కానీ దీనిని పెద్దగా చేయకండి అంటూ ఈ విషయంపై విజయ్ సేతుపతి స్పందించారు.అయితే ఇతనిని తన్నిన వారికి వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తానని హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

విజయ్ సేతుపతి విషయం మరిచిపోకముందే మరొక హీరో సూర్యను టార్గెట్ చేస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే హీరో సూర్యను కొడితే కొట్టిన వారికి లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తానని పిఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం బహిరంగంగా ప్రకటించారు.

అయితే ఇలా ఎందుకు ప్రకటించారు అనే విషయానికి వస్తే… తాజాగా టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వం లో హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతుంది.ఈ క్రమంలోనే ఈ చిత్రంపై ఎన్నో వివాదాలు అలముకున్నాయి.ఒక వర్గానికి చెందిన వారు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా మరొక వర్గానికి చెందిన వారు ఈ సినిమా పై పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Telugu Surya, Controversy, Jai Bhim, Kollywood, Reward, Paneer Selvam, Pmk, Pris

జై భీమ్ చిత్రం 1995లో తమిళనాడులోని ఒక గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.ఎలాంటి పాపం తెలియని ఒక దళితుడిని పోలీసులు అరెస్టు చేయడంతో అరెస్టు చేసిన తర్వాత ఆ వ్యక్తి కనిపించకుండా పోవడంతో తన భర్త ఆచూకీ కోసం ఆ భార్య ఎలా పోరాటం చేసింది ఆమె తరఫున హైకోర్టు లాయర్ చంద్రు ఈ కేసును వాదించి ఆమెకు న్యాయం చేశారు.ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రాన్ని చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి సైతం దర్శకుడు, హీరో సూర్య ప్రశంసలు కురిపించారు.

Telugu Surya, Controversy, Jai Bhim, Kollywood, Reward, Paneer Selvam, Pmk, Pris

అయితే తాజాగా ఈ చిత్రంపై పిఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం పోలీసులకు ఫిర్యాదు చేశారు.సూర్య నటించిన ఈ చిత్రం కేవలం ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఉందంటూ కుల వర్గాలను రెచ్చగొట్టి అల్లర్లను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే ఈ చిత్ర నిర్మాత దర్శకులపై పిఎంకె కార్యదర్శి పన్నీర్ సెల్వం వెల్లడించారు.అదేవిధంగా నటుడు సూర్య మైలాడుతురై జిల్లాకు వస్తే అతనిపై దాడి చేయాలని, దాడికి ప్రయత్నించిన యువకులకు పార్టీ తరఫున లక్ష రూపాయలు అవార్డు ఇవ్వనున్నట్లు సెల్వం వెల్లడించారు.

అదే విధంగా హీరో సూర్య 5 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని తెలిపారు.

Telugu Surya, Controversy, Jai Bhim, Kollywood, Reward, Paneer Selvam, Pmk, Pris

అయితే ప్రస్తుతం సూర్య పట్ల ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడం చేత సూర్య అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ నటులు, అభిమానులు సూర్యకు మద్దతుగా నిలబడుతున్నారు.సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలకు తెలియజేయడం కోసమే ఈ సినిమాని ప్రజల ముందుకు తీసుకు వచ్చామని అంతే కానీ ఒక వర్గాన్ని ఉద్దేశిస్తూ సినిమా చేయలేదు అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube