శోభనబాబుతో కలిసి నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్న పవర్ స్టార్!

ఒకప్పటి తెలుగు స్టార్ హీరో శోభన్ బాబు గురించి తెలియని వారెవ్వరూ లేరు.ఇప్పటికీ ఈయన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు.

 Pawan Kalyan Miss The Chance To Act With Shoban Babu In Suswagatham Movie, Pawa-TeluguStop.com

ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంబంధించిన సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇదిలా ఉంటే ఈయనతో కలిసి నటించాలని ఎంతో మంది నటులు అనుకున్నారు.

కానీ ఆ కోరిక తీర్చలేకుండానే… తెలుగు ప్రేక్షకులను దూరమయ్యాడు.ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా శోభన్ బాబుతో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ఎంతో అభిమానం.ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు కూడా పవన్ అంటే ఎంతో అభిమానం.

అంతే కాకుండా ఆయన సినిమాలో కూడా నటించడానికి అవకాశం వస్తే చాలు అనుకుంటారు.అలాంటిది పవన్ కూడా శోభన్ బాబు తో నటించాలని అనుకున్నాడు.కానీ ఆ కోరిక పవన్ కు తీరలేకపోయింది.ఇంతకీ శోభన్ బాబు తో నటించే అవకాశం ఏ సినిమాలోనో కాదు.

భీమినేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన సుస్వాగతం సినిమా.

Telugu Shoban Babu, Chance, Pawan Kalyan, Shobhan Babu, Suswagatham, Tollywood-M

ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మంచి సక్సెస్ అందుకొని ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.ఇప్పటికీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఇందులో తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ప్రేమను, అనుబంధాన్ని చక్కగా చూపించారు.

Telugu Shoban Babu, Chance, Pawan Kalyan, Shobhan Babu, Suswagatham, Tollywood-M

ఇందులో పవన్ కి తండ్రిగా రఘువరన్ నటించగా.ఆయనకు ఈ పాత్ర మంచి సక్సెస్ ను అందించింది.కానీ ఇందులో రఘువరన్ కు ముందు తండ్రి పాత్రలో శోభన్ బాబు అయితే పవన్ కు బాగా సెట్ అవుతుందని నిర్మాత ఆర్.బి.చౌదరి అనుకున్నాడట.అలా శోభన్ బాబు ను కూడా అడగటంతో శోభన్ బాబు ఒప్పుకోలేదట.

కారణం శోభన్ బాబు అప్పటికే సినిమాలకు రిటైర్మెంట్ తీసుకున్నాడని అందుకు నటించడానికి ఆసక్తి చూపలేదని తెలిసింది.దీంతో పవన్ కు శోభన్ బాబు తో నటించే అవకాశం మిస్ అయిందని దర్శక నిర్మాతలు అనుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube