గొర్రెల కాపరికి కరోనా.. 'ఐసోలేషన్'కు గొర్రెలు, మేకలు!

దేశం ఏదైనా రాష్ట్రం ఏదైనా ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ భయమే కనిపిస్తోంది.రోజు రోజుకీ విజృంభిస్తున్న మహమ్మారి వైరస్ ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటోంది.

 The Sheep Were Moved To The Isolation Ward After A Person Had A Corona Positive,-TeluguStop.com

అంతే కాదు ఇంకెంతో మందిని మృత్యువుతో పోరాడేలా చేస్తోంది.అయితే ఇప్పటివరకు ఒక వ్యక్తి కారణంగా కొంతమంది జనాలను ఐసోలేషన్ వార్డుకు తరలించడం మనం చూసే ఉంటాం.

కానీ ఇక్కడ ఒక వ్యక్తి కారణంగా ఏకంగా 50 గొర్రెలు మేకలను ఐసోలేషన్ కు తరలించారు.ఈ ఘటన కర్ణాటకలోని తుముకూరు జిల్లా గోడెకరీ గ్రామంలో చోటు చేసుకుంది.

అయితే ఓ గొర్రెల కాపరికి ఇటీవలే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే అతను మేపే గొర్రెలు మేకలకు కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి.

దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే డిప్యూటీ కమిషనర్ పశుసంవర్ధక శాఖ అధికారులకు దర్యాప్తు చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు.

ఇక ఆ గొర్రెలు మేకల శాంపిల్ తీసుకొని పరీక్షించగా నెగిటివ్ అని వచ్చింది.దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే గొర్రెలకు ప్లేగు వ్యాధి, మైకోప్లాస్మా ఇన్ఫెక్షన్ వచ్చింది.ఇక ఇది కూడా అంటూ వ్యాధి కావడంతో సదరు గొర్రెలు మేకలను ఐసొలేషన్ కు తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube