బిగ్ బాస్4 హౌస్ లో ఈసారి నామినేట్ అయిన ఆ ఏడుగురు…!  

the seven who were nominated this time in bigg boss 4 house bb4, bigg boss, akil, nagarjuna, lasya, mahabub, harika, sohel, kumar sai, nominate - Telugu Akil, Bb4, Bigg Boss, Harika, Kumar Sai, Lasya, Mahabub, Nagarjuna, Nominate, Sohel

బిగ్ బాస్ 4 హౌస్ లో రోజు రోజుకి గేమ్ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.అలకలు, కొట్లాటలు, రొమాన్స్ ఇలా అన్ని కలుపుకొని ముందుకు సాగుతోంది బిగ్ బాస్ 4 సీజన్.

TeluguStop.com - The Seven Who Were Nominated This Time In Bigg Boss 4 House 4

ఇకపోతే ఆదివారం వస్తే చాలు ఇంటి నుండి ఒక సభ్యుని బయటికి పంపించడం ఆనవాయితీ.అలాగే సోమవారంనాడు వచ్చే వారం ఎవరిని పంపించాలన్న విషయం పై నామినేషన్ ప్రక్రియ మొదలైపోతుంది.

తాజాగా ఈ వారం కూడా రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో మొత్తం 7 మంది సభ్యులను ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ చేశారు.

TeluguStop.com - బిగ్ బాస్4 హౌస్ లో ఈసారి నామినేట్ అయిన ఆ ఏడుగురు…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా మొదటగా బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు.

అందులో అఖిల్, సోహెల్ లను హిట్ మ్యాన్ లుగా ఉంటారని తెలిపి ఆట మొదలు పెట్టాడు.ఇలా మొదలైన నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా అమ్మరాజశేఖర్… స్వాతి దీక్షిత్  నునామినేట్ చేశాడు.

ఆ తర్వాత మెహబూబ్… అభిజిత్ ని నామినేట్ చేయగా, అరియానా లాస్య ను నామినేట్ చేసింది.ఆపై హారిక.

మెహబూబ్ ను నామినేట్ చేయగా, సుజాత.కుమార్ సాయిని నామినేట్ చేశారు.

అయితే ఇలా నామినేట్ చేసే సమయంలో వారు ఎందుకు నామినేట్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా తెలిపి వారిని నామినేట్ చేశారు.ఇక చివరగా హిట్ మ్యాన్ లుగా ఉన్న సోహెల్, అఖిల్ ఇద్దరిలో అఖిల్ నాలుగుసార్లు గన్ను చేజిక్కించుకోవడంతో అతను సేవ్ అవ్వగా సోహెల్ నామినేట్ అయ్యాడు.

ఇక ఆ తర్వాత మరోసారి బిగ్ బాస్ అఖిల్ కు నామినేటెడ్ చేయడానికి మరో అవకాశం ఇచ్చాడు.దీంతో హారికను.అఖిల్ ప్రతి విషయంలో తను దూరుతోంది అనే కారణంతో హారిక ను నామినేట్ చేసినట్టు పేర్కొన్నాడు.దీంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నుండి వెళ్లడానికి మొత్తం 7 మంది సభ్యులు నామినేట్ అయ్యారు.

స్వాతి దీక్షిత్, లాస్య, మెహబూబ్, హారిక, సోహెల్, కుమార్ సాయి లు నామినేషన్ లిస్టులో ఉన్నారు.గత వారం దేవి నాగవల్లి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.

చూడాలి మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో.

#Kumar Sai #Akil #Nagarjuna #Harika #Lasya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

The Seven Who Were Nominated This Time In Bigg Boss 4 House 4 Related Telugu News,Photos/Pics,Images..