అందరు ఉన్న అనాథను నేను అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సీరియల్ నటి?

ఒక వ్యక్తి ఎప్పుడైనా ఆనందంగా ఉన్నారు అంటే అందుకు కారణం తన చుట్టూ ఉన్న తన కుటుంబ సభ్యులు అని చెప్పవచ్చు.ఏ చిన్న ఆపద వచ్చినా మన కోసం తల్లడిల్లిపోయే కుటుంబ సభ్యులను చూస్తే ఎలాంటి కష్టాన్నైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కోవచ్చు అనే భావన అందరిలో కలుగుతుంది.

 The Serial Actress Naveena Cry And Saidi Have All And I Am Orphan-TeluguStop.com

కానీ ఈ నటి జీవితంలో అలా కాదు.జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.

తన చుట్టూ ఎంతో మంది కుటుంబ సభ్యులు ఉన్నా తాను మాత్రం అనాధగానే మిగిలింది.ఆమె సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి నవీన.

 The Serial Actress Naveena Cry And Saidi Have All And I Am Orphan-అందరు ఉన్న అనాథను నేను అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సీరియల్ నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీరియల్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సీరియల్స్లో నటిస్తూ సుమారు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న నవీన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తను పెళ్లికాకముందు నుంచి సీరియల్స్ లో నటిస్తున్నానని పెళ్లి తర్వాత కొంతకాలం బుల్లితెరకు దూరమయ్యానని చెప్పుకొచ్చారు.అందుకు గల కారణం తన భర్త తనని సీరియల్స్లో నటించవద్దని చెప్పడంతో కొంత కాలం ఇండస్ట్రీకి దూరమయ్యారని అయితే తన భర్తతో గొడవల కారణంగా తన నుంచి విడిపోయి తిరిగి బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.

Telugu Actress, Actress Naveena Problems, Actress Naveena Real Life, Corona, Get Emotional, Husband, Naveena, Orphan, Senior Seria Artist Naveena, Serial Aartist, Tollywood-Movie

ఇకపోతే తన జీవితంలో ఏదైనా ఫెయిల్యూర్ ఉందా అన్న ప్రశ్న ఎదురవగా తన జీవితమే ఒక ఫెయిల్యూర్ అయిందనే సమాధానాన్ని తెలియజేశారు.తనకు ఎక్కువగా స్నేహితులు ఎవరూ లేకపోవడం వల్ల తన ఆలోచనలను ఇతరులతో పంచుకోలేక తన సొంత నిర్ణయాలు తీసుకొని జీవితంలో ఎన్నో కోల్పోయానని, అలా తన జీవితమే ఫెయిల్యూర్ అయిందని ఈ సందర్భంగా నటి నవీన చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే తన జీవితంలో ఏం కోల్పోయానో తెలుసుకున్న ఈమె అప్పటి నుంచిప్రతి విషయం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

Telugu Actress, Actress Naveena Problems, Actress Naveena Real Life, Corona, Get Emotional, Husband, Naveena, Orphan, Senior Seria Artist Naveena, Serial Aartist, Tollywood-Movie

ఇక తన జీవితంలో అన్నీ ఉన్నా కూడా తన చుట్టూ తన కుటుంబ సభ్యులు లేరనేలోటు తనకు తెలుస్తుందని, ఒకసారి కరోనా సమయంలో తనకు ఆరోగ్యం బాగా లేకపోతే తన కంటూ చూసుకోవడానికి ఎవరూ లేరని, కేవలం తనతోపాటు ఆ భగవంతుడు మాత్రమే తనకు తోడుగా ఉన్నారని, తనకు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నా కూడా తను ఒక అనాధగా మిగిలిపోయానని ఈమె ఎమోషనల్ అయ్యారు.జీవితం తనకు ఎన్నో గుణ పాఠాలు నేర్పిందని తాను ఎంతో త్వరగా ముందుకు వెళ్లాలని ప్రయత్నించిన అంతే తొందరగా కిందపడి పోతున్నాననీ నిదానమే ప్రధానం అన్న విషయాన్ని తెలుసుకుని ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా తనకి సపోర్ట్ చేసే వారి దగ్గర తన నిర్ణయాన్ని వెల్లడించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇలా ప్రస్తుతం తన జీవితం సంతోషంగానే ఉందని తను జీవితంలో కోల్పోయిన పాత్రలన్నీ సీరియల్స్ లో నటించానని ఈ సందర్భంగా నవీన తెలియజేశారు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో తల్లి, అత్త పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

#Actress Naveena #Aartist #Naveena #ActressNaveena #Orphan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube