కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సర్కార్,సరిహద్దులు మూసివేత  

Delhi Government Will Be Taking Important Decision About Caa Clashes - Telugu Delhi Caa Issues, Delhi Cm Kejriwal, Delhi Government, , Japrabadh, Kejriwal Emergency Meeting With Mla\\'s, Sunday Howzipuri

ఢిల్లీ లో ఘర్షణలు మంగళవారం కూడా చోటుచేసుకున్నాయి.సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణతో దేశ రాజధాని ఢిల్లీ లో చెలరేగిన హింస లో దాదాపు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.

Delhi Government Will Be Taking Important Decision About Caa Clashes

ఈశాన్య ఢిల్లీలో ఈ రోజు ఉదయం కూడా ఆందోళనకారులు పరస్పర ఘర్షణలకు దిగడమే కాకుండా ఒకరినొకరు రాళ్లు రువ్వుకున్నారు.పలు వాహనాలు, ఇళ్ళు, దుకాణాలకు నిప్పు పెట్టారు.

ఆదివారం నుంచే మౌజ్ పురి, జఫ్రాబాద్ తదితర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగగా, ఇప్పటికి 7 గురు మృతి చెందగా,వందమందికి పైగా గాయపడ్డారు.అయితే మృతి చెందిన వారిలో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

అలానే గాయపడిన వారిలో కూడా 48 మంది పోలీసులు ఉన్నట్లు సమాచారం.ఈ తాజాగా ఘర్షణల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా.ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోను, లెఫ్టినెంట్ గవర్నర్ తోను సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తుంది.

మరోవైపు కేజ్రీవాల్, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో అత్యవసరంగా భేటీ అయి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.బయటి నుంచి విద్రోహ శక్తులు దేశ రాజధానిలోకి వచ్చి హింసకు పాల్పడుతున్నాయని గుర్తించిన సీఏం, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలను కొంతకాలం మూసివేయాలని భావిస్తున్నట్లు సమాచారం.అలాగే, సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్రం అదనపు బలగాలను మోహరించనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం కేజ్రీవాల్ తెలిపారు.

అల్లర్లను తగ్గించి రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారని కేజ్రీ తెలిపారు.అయితే దేశంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటిస్తున్న ఈ సమయంలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడం తో అటు కేంద్ర ప్రభుత్వం,ఇటు ఢిల్లీ సర్కార్ ఇబ్బందుల్లో పడ్డాయి.

తాజా వార్తలు

Delhi Government Will Be Taking Important Decision About Caa Clashes-delhi Cm Kejriwal,delhi Government,japrabadh,kejriwal Emergency Meeting With Mla\\'s,sunday Howzipuri Related....