మాస్క్ విషయంలో మరింత కఠినంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది.ఇటువంటి తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.

 The Sensational Decision Of The Ap Government To Be More Strict In The Case Of T-TeluguStop.com

ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.దీంతో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు కఠినంగా… రాష్ట్రంలో అమలు చేయడానికి రెడీ అయ్యింది.

దీనిలో భాగంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ మాస్కులు లేకుండా… బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే వంద రూపాయల ఫైన్ విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అదే రీతిలో మాస్క్ లేకుండా.ఎవరినైనా దుకాణాలలోకి అనుమతిస్తే సదరు దుకాణదారుడుకి పరిస్థితి తీవ్రతను బట్టి వారికి రూ.10,000 నుండి రూ.25,000 వరకు జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.అదే రీతిలో మార్కెట్ లేదా ఏదైనా పెద్ద వాణిజ్య సంస్థలలో… కరోనా నిబంధనలు పాటించకపోతే… సదరు ప్రాంగణం మొత్తం రెండు రోజులు మూసేసేలా.

ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇక ఇదే సమయంలో కరోనా నిబంధనలు ఎక్కడ ఎవరైతే పాటించకుండా ఉంటారో వాటికి సంబంధించిన ఫోటోలను వాట్సాప్ నంబర్ 8010968295లకి పంపిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube