మా ఎన్నికలకు రంగం సిద్ధం.. మంచు విష్ణు ప్యానెల్ రేపు ప్రకటన.. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వచ్చే నెల 10న జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అక్టోబర్ 10వ తేదీన ఆదివారం ఉదయం 8 నుంచి  మధ్యాహ్నం12 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో పోలింగ్ జరుగుతుంది.

 The Sector Is Ready For Our Elections Snow Vishnu Panel Announcement Tomorrow-TeluguStop.com

అదేరోజు ఫలితాలను ప్రకటించనున్నారు.మా ఎన్నికల్లో అధ్యక్షుడి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్‌ నర్సింహరావు పోటీపడుతున్నారు.

ఇప్పటికే ప్రకాష్ రాజు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు.

 The Sector Is Ready For Our Elections Snow Vishnu Panel Announcement Tomorrow-మా ఎన్నికలకు రంగం సిద్ధం.. మంచు విష్ణు ప్యానెల్ రేపు ప్రకటన.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా మంచు విష్ణు సైతం తన ప్యానెల్ సభ్యులను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.

రేపు (గురువారం) ఆయన తన ప్యానెల్ ను ప్రకటించనున్నారు.ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్ లో బాబుమోహన్, రఘుబాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

వైస్ ప్రెసిడెంట్ గా బాబుమోహన్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు ఉండనున్నట్లు సమాచారం.ప్రకాష్ రాజు ప్యానెల్ కు దీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉండనుందని సినీ పరిశ్రమలోని మహామహులను మంచు విష్ణు రంగంలోకి దింపనున్నారని సమాచారం.

 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మంచి రసవత్తరంగా మారే విధంగా కనిపిస్తున్నాయి. మా ఎన్నికల బట్టి చూస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో రెండు వర్గాలు ప్రధానంగా కనిపిస్తున్నాయని అర్థమవుతుంది.

#Vishnu Pannel #MAA #Manchu Vishnu #Prakash Raju #Raghu Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు