తిరుమలలో స్వామివారికి అలంకరించిన పూలమాలలు బావిలో ఎందుకు వేస్తారో తెలుసా..?

కలియుగ దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.ఇక్కడ వెలిసిన స్వామివారు భక్తులకు కోరికలను నెరవేరుస్తూ భక్తుల కొంగు బంగారం చేస్తుంటారు.

 Secret Behind Tirumala Flowers Well , Tirupathi, Srinivasudu, Flowers, Well, Poola Baavi, Sri Venkateswara Swamy, Tirumala, Secret, Tondamanudu, Lakshmi Devi, Ramanujulu, Priests-TeluguStop.com

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ స్వామివారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన స్వామివారికి ప్రతిరోజు అలంకరించే పూలమాలలను బయట ఎక్కడ వేయకుండా ఒక బావిలో మాత్రమే వేస్తారనే విషయం మనకు తెలిసిందే.అయితే స్వామివారికి సమర్పించిన పూలమాలలు బావిలో ఎందుకు వేస్తారో చాలా మందికి తెలియకపోవచ్చు.

 Secret Behind Tirumala Flowers Well , Tirupathi, Srinivasudu, Flowers, Well, Poola Baavi, Sri Venkateswara Swamy, Tirumala, Secret, Tondamanudu, Lakshmi Devi, Ramanujulu, Priests-తిరుమలలో స్వామివారికి అలంకరించిన పూలమాలలు బావిలో ఎందుకు వేస్తారో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే స్వామి వారికి సమర్పించిన పూలమాలలు బావిలో చేయటానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

తిరుపతిలోని స్వామివారి ఆలయంలో అద్దాల మంటపానికి ఉత్తరదిక్కున ఈ బావి ఉంది.ప్రతిరోజూ స్వామివారికి సమర్పించిన తులసి మాలలు, పూల దండలు భక్తులకు ఎవరికీ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న బావిలో పడేస్తారు.

ఈ విధంగా వేయడానికి గల కారణం పూర్వం స్వామివారి భక్తుడైన తొండమానుడు అనే వ్యక్తి ఆపద వచ్చినప్పుడల్లా ఈ బావి స్వరంగ మార్గం ద్వారానే స్వామివారిని శరణు కోరేవాడు.

Telugu Flowers, Lakshmi Devi, Poola Baavi, Ramanujulu, Secret, Srivenkateswara, Srinivasudu, Tirumala, Tirupathi, Tondamanudu, Well-Telugu Bhakthi

ఈ క్రమంలోనే ఒకరోజు స్వామివారు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తొండమానుడు అక్కడికి ప్రవేశించగానే సిగ్గు పడిన దేవేరులు హడావుడిపడి లక్ష్మీదేవి స్వామి వారి వక్షస్థలం చేరుకోగా, భూదేవి దగ్గరలో ఉన్న బావిలోకి వెళ్ళిపోయారు.ఈ కథ విన్న రామానుజులవారు అప్పటినుంచి స్వామివారికి అలంకరించిన తీసివేసిన పూలమాలలు ఈ బావిలోని వేయాలని నిబంధన విధించారు.ఆ విధంగా స్వామివారికి ఉపయోగించిన పూలమాలలను ఈ బావిలో వేయటం వల్ల ఈ బావిని పూలబావి అని పిలుస్తారు.

కానీ ప్రస్తుత కాలంలో స్వామివారికి విశేషంగా పుష్పాలంకరణ జరుగుతుండటం వల్ల ఈ పువ్వులన్నింటినీ బావిలో కాకుండా తిరుమల పర్వత సానువుల్లో ఎవరూ తొక్కని ప్రదేశములో ఈ పూలమాలలను జారవిడుస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube