ఏపీ సీఎం జగన్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు చేసిందేమీ లేదని తెలిపారు.
రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.అదేవిధంగా రైతులకు సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేస్తున్నామన్న ఆయన ఈనెల 7వ తేదీన రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.