చంద్రబాబు లాగా ఉన్న వ్యక్తి దొరికేసాడు అనుకున్న టైం కి 'వర్మ' కు పెద్ద ట్విస్ట్.! ఆ సర్వర్ ఏమని రిప్లై ఇచ్చారంటే.?  

The Sarver Babu Refuses Rgv Proposal In Lakshmi\'s Ntr Movie-

ఏపీ ముఖ్యమంత్రి పోలికలతో ఉన్న ఓవ్యక్తికి సంబంధించిన వీడియో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి ఆచూకీ దొరకడం….లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తా అంటే వద్దు అనడం కూడా అందరికి తెలిసిందే. ఇప్పుడు వర్మ కు పెద్ద ట్విస్ట్ ఎదురైంది. అసలేమైంది అంటే.?

The Sarver Babu Refuses RGV Proposal In Lakshmi's NTR Movie-

The Sarver Babu Refuses RGV Proposal In Lakshmi's NTR Movie

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మద్యే మళ్ళీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తూ లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరుతొ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పిన విషయం తెలిసిందే.తాను తెరకెక్కించే లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాకోసం అచ్చంగా చంద్రబాబులా ఉన్న వ్యక్తిని చూసి చంద్రబాబు నాకు దొరికేసాడు. అతని ఆచూకీ చెబితే లక్ష రూపాయలు బహుమతి అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు దొరికాడని ఓ మీడియా వ్యక్తి అతని ఆచూకీ చెప్పాడని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

చంద్రబాబు పోలికలతో ఉన్న ఆ సర్వర్ వర్మకు ఘాటైన రిప్లై ఇచ్చాడు. హోటల్ లో పప్పు రుబ్బుతూ చట్నీ వడ్డిస్తూ హాయిగా బ్రతుకుతున్నా ఇప్పుడు నువ్వోచ్చి పిచ్చి పిచ్చి సినిమాలు తీసి నా జీవితం నాశనం చెయ్యకు. అని కౌంటర్ ఇచ్చారు.

The Sarver Babu Refuses RGV Proposal In Lakshmi's NTR Movie-

దాంతో ఈ విషయం పై అలాంటి మీనింగ్ వచ్చేలా ఓ కార్టూన్ ని పోస్ట్ చేసాడు వర్మ. అంతేలే … పిచ్చి పిచ్చి సినిమాలతో జనాలతో ఆడుకుంటున్న వర్మకు ఇలాంటి ఎదురు దెబ్బలు తప్పవు కనీసం ఇకనైన తన ఇమేజ్ తగ్గట్టుగా ఆ స్టాండర్డ్ సినిమాలు చేస్తే బెటర్ !!