మేం ఓడిపోవడానికి అదే కారణం: విరాట్ కోహ్లీ

ప్రపంచకప్‌లో భారత్‌పై తొలిసారి పాకిస్థాన్‌ ఘన విజయం సొంతం చేసుకుంది.నిన్న జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా ఎంత తేడాతో విజయం సాధిస్తుందోననే ఒక్క ఆలోచనతోనే అభిమానులంతా ఉన్నారు.

 The Same Reason We Lost: Virat Kohli Virat Kohli, Reason, Losser, Sports Updates-TeluguStop.com

కానీ పాకిస్థాన్‌ అనూహ్యమైన ఆటతీరుతో.భారత్ పేలవమైన పర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ ఆశలన్నీ అడియాసలయ్యాయి.

అయితే కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు ఉన్నట్లు భారత్ ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కేఎల్ రాహుల్ ఔట్ విషయంలో అంపైరింగ్ తప్పిదాలు తుది జట్టు ఎంపికలో విరాట్ కోహ్లీ తప్పటడుగులను ఎత్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో స్వయంగా విరాట్ కోహ్లీయే టీమిండియా ఓటమికి కారణాలు చెప్పారు.

తమ ప్లాన్స్ ను సరిగా అమలు చేయకపోవడం వల్లే ఈరోజు ఓడిపోవాలి వచ్చిందని మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించారు.

తమ ఆటకు మంచు ప్రతికూలంగా మారిందని.దీనికితోడు ఆరంభం నుంచే పాకిస్థాన్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని.దీంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిపోయిందని తెలిపాడు.టోర్నీలో ఇదే ఆఖరి మ్యాచ్ కాదన .తదుపరి మ్యాచ్‌ల్లో పక్కా ప్రణాళికతో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Telugu Latest, Losser, Ups, Virat Kohli-Latest News - Telugu

పాకిస్థాన్ బౌలర్లు అత్యద్భుతంగా రాణించారని.తొలి ఓవర్లలోనే 20 పరుగుల్లోపే మూడు కీలక వికెట్లు తీసి తమ జట్టుని అతలాకుతలం చేసి ఆత్మ విశ్వాసం దెబ్బతీశారని పేర్కొన్నారు.కానీ తాము మాత్రం వికెట్లను తీయలేక పోయామని ఆ ఛాన్స్ కూడా తమకు దక్కలేదని వెల్లడించారు.

తమ బ్యాటింగ్ సమయంలో ఫస్టాఫ్ నెమ్మదిగా ఆడామని ఆ తర్వాత స్పీడ్ పెంచినప్పటికీ పాక్ బౌలర్లు తమ వేగానికి బ్రేకులు వేశారని పేర్కొన్నారు.రోహిత్ శర్మని తీసుకోకుండా ఉండాల్సి ఉందని ఒక జర్నలిస్టు అడగగా కోహ్లీ మండిపడ్డారు.

వివాదాలకు తెర లేపొద్దని చురకలంటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube