భర్త ఫోటో మార్చి పేపర్లో వేసారు..కుటుంబంలో చిచ్చుపెట్టారు.. ఇంతకీ ఆ ఫోటో పేపర్ వాళ్లకి ఎలా వచ్చింది..

తన అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల్లో తన భర్తగా వేరొకరిని చూపడాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయికి చెందిన మహిళ పద్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

 The Rythu Bhima And Kanti Velugu Programme Wrong Ad-TeluguStop.com

ఇటీవల కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.

ఈ ప్రకటనలో ఒక కుటుంబం ఫోటోని ప్రచురించింది.ఆ ప్రకటనల్లో కొన్ని పత్రికలు భర్తగా ఒకరిని, మరికొన్ని ప్రకటనల్లో ఇంకొకరిని చూపించారు.

ఇప్పుడు తన భర్త ఫొటోను మార్చడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఆ మహిళ.ఇంతకీ ఆమె ఎవరు.

వారి ఫోటో పత్రికల వారకి ఎలా వచ్చింది.

సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలానికి చెందిన తొగర్రాయి గ్రామంకి చెందినది ఆ కుటుంబం.మహిళ పేరు పద్మ, ఆమె భర్త పేరు నాగరాజు.ప్రస్తుతం యాదగిరిగుట్ట సమీపంలోని వంగవల్లిలో నివాసం ఉంటున్నారు.

మూడేళ్ల క్రితం తమ గ్రామానికి వచ్చిన కొంతమంది లోన్ల పేరుతో ఫొటోలు తీసుకున్నారని,అవి పేపర్లకు ఎలా వచ్చాయో తెలీదని చెప్తున్న ఆమె.భర్త ఫోటో మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆమె మాటల్లోనే.

మేమే పాత చీరలు, బొంతలు కుట్టుకుంటామని, ఒకరోజు, ఐదుగురో, పదిమందో వచ్చారు, గొడుగులు అవి తీసుకు వచ్చారు, మీకు లోన్లు ఇస్తామని చెప్పారు, ఆ తర్వాత సంతకం పెట్టించుకున్నారో లేదో గుర్తుకు లేదు, తమకు మాత్రం లోన్లు ఇస్తామని చెప్పారు, తమ పాపకు స్నానం చేయిస్తుంటే ఫోటో తీసుకొని పోయారు.

ఆ తర్వాత మాకు ఏ విషయం తెలియదు.ఆ తర్వాత బస్సుల్లో, బడులలో చూస్తే మా ఫోటోలు కనిపించాయి.అప్పుడు అడిగేవారు ఎవరూ లేక, మాకు తెలియక దానిని పట్టించుకోలేదు.భువనగిరిలోను ఫోటోలు పెట్టారు,వాటి గురించి మాకు తెలియదు.

ఆ తర్వాత పేపర్లో వచ్చిందని (యాడ్) చెప్పారు.ఆ ఫోటోలు మావే అనుకున్నామని, అయితే నా పక్కన మా ఆయన ఫోటో లేదు ,ఎవరి ఫోటోనో పెడితే ఎలా అని బాదపడుతుంది ఆ మహిళ.

కూలి నాలి చేసుకుని బతికే తమను ఇలా బజారుపాలు చేసి మా సంసారంలో నిప్పులు పోస్తారా అని నిలదీస్తున్న ఆమె.పత్రికలో యాడ్ వచ్చిన నాటి నుంచి తమ ఇంట్లో గొడవలు అవుతున్నాయని ఆమె బాధపడుతూ చెప్పారు.ఏదైతేనేమి ప్రభుత్వమో,పత్రికలు వారు చేసిన ఒక తప్పుకి ఒక కుటుంబం అభాసుపాలైంది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube