భట్టి పార్టీ మార్పుపై మొదలైన పుకార్లు... అసలు నిజం ఇదే

తెలంగాణ రాజకీయాలలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ మొదలైందనే పుకార్లు వినిపిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కి ఎమ్మెల్యేల సంఖ్య బలం బాగానే ఉండడంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరదీసే అవకాశం అయితే కనిపించడం లేదు.

 The Rumors That Started About The Bhatti Party Change This Is The Real Truth, Tr-TeluguStop.com

ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తాజాగా భట్టి విక్రమార్కను మంత్రి కేటీఆర్ పొగిడిన విషయం తెలిసిందే.

దీంతో భట్టి విక్రమార్క త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు భట్టి విక్రమార్క దీనిపై స్పందించలేదు.

అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్ పార్టీ భట్టి విక్రమార్క చేరికపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం హాట్ టాపిక్ గా ఉన్న పరిస్థితుల్లో ఈ సమయంలో భట్టి టీఆర్ఎస్ పార్టీ లో చేరిక అంశం ఇటు కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలకు నష్టం కలిగించే అంశంగా అవుతుందనే ఉద్దేశ్యంతో ఇటు భట్టి కానీ కెటీఆర్ కాని స్పందించడం లేదని అంతర్గతంగా చర్చ నడుస్తోంది.

ఒకవేళ భట్టి విక్రమార్క కాంగ్రెస్ ను వీడితే కాంగ్రెస్ కు అతి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.ఎందుకంటే  రాజకీయంగా ఎన్ని ఒడుదుడుకులొచ్చినా కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటూ మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఒకప్పటిలా బలంగా ఉంచిన పరిస్థితి ఉంది.

అంతేకాక భట్టి చేరికతో టీఆర్ఎస్ కూడా ఖమ్మం జిల్లాలో మరింత బలపడే అవకాశం ఉంది.ఏది ఏమైనా రానున్న రోజుల్లో అంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడ్డ తరువాత రాజకీయంగా ఎటువంటి సంచలన ఘటనలు జరుగుతాయనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube