గుడిలో కొబ్బరికాయను కొట్టడంలో ఉన్న నియమాల గురించి తెలుసా?

హిందూ సంప్రదాయం లో భగవంతుని పూజలో భాగంగా దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక ఆచారం.శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి.

భగవంతుని నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి.రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది.

 The Rules For Breaking Coconut In Temples-The Rules For Breaking Coconut In Temples-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొబ్బరి కాయ కొట్టేటప్పుడు 9 అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది

సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని మన పెద్దలు అంటారు.కొంచెం అటు, ఇటు ఐనా పర్లేదు.

కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది.అదేదో అశుభం అని దిగులుపడఖర్లేదు.

దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు.ఆ సమయంలో “శివాయనమః” అని 108 సార్లు జపిస్తే పరిహారం అవుతుంది

కొబ్బరికాయ కొట్టి దానిని విడదీయకుండా తీసుకువచ్చి అభిషేకం చేస్తారు చాలామంది.

ఈ విధంగా చేయటం చాలా తప్పు.అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు

కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి.

పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకానికి ఉపయోగించాలి.వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU