ఐటెం సాంగ్ అడిగినందుకు నువ్వు చేస్తావా అంటూ కౌంటర్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్?

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఎన్నో కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది.

 Rrr Team Reply To Netizen Who Asks For Item Song Details, Rrr, Tollywood, Movie,-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ సహనం కోల్పోయి ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి ట్యాగ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం ఒక నెటిజన్ నేను బీటెక్ చదివేటప్పుడు సినిమా స్టార్ట్ చేశారు ప్రస్తుతం నా బీటెక్ పూర్తి అయిన ఈ సినిమా విడుదల కాలేదంటూ కామెంట్లు చేయడంతో అందుకు చిత్రబృందం సరైన రీతిలో సమాధానం చెప్పారు.

ఈ క్రమంలోనే తాజాగా మరోక నెటిజన్ స్పందిస్తూ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఐటమ్ సాంగ్ ఉందా మావ అంటూ కామెంట్ చేశారు.దీనికి స్పందించిన చిత్రబృందం ఏం నువ్వు చేస్తావా.

అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ చిత్రంవచ్చే ఏడాది జనవరి 7వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుందని వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటి నుంచి మొదలు పెట్టారు.తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన జనని పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమాపై రోజురోజుకు అంచనాలు పెంచేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube