ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ డూప్ గా నటించిన ఈ వ్యక్తికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా?

ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.కేజీఎఫ్2 మూవీ విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి.అయితే ఆర్ఆర్ఆర్ మూవీలోని కొన్ని సీన్లలో ఎన్టీఆర్ కు డూప్ గా ఇమ్రాన్ అనే వ్యక్తి నటించారు.సినిమాలోని క్లిష్టమైన సన్నివేశాల్లో డూప్ అవసరమైన సీన్లలో ఇమ్రాన్ నటించారు.

 Rrr Movie Junior Ntr Doop Imran Remuneration Details, Junior Ntr, Junior Ntr Doo-TeluguStop.com

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించినందుకు 2 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కిందని ఇమ్రాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆర్ఆర్ఆర్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో ఇమ్రాన్ కు కూడా మంచి పేరు వచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇమ్రాన్ కు సినిమా ఆఫర్లు మరింత పెరిగాయని సమాచారం అందుతోంది.ఇమ్రాన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ ను తాను డైరెక్ట్ గా చూశానని తెలిపారు.

ఆ సీన్ కోసం ఎన్టీఆర్ 50 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తారని ఇమ్రాన్ కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారని ఇమ్రాన్ తెలిపారు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ విడుదలై నెలరోజులైనా ఈ సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతోంది.

Telugu Lakhs Rupees, Rajamouli, Doop, Imran, Ntr, Ntr Doop, Mahesh Babu, Ntr Doo

సినిమాలో ఎన్టీఆర్, చరణ్ తమ నటనతో అదరగొట్టారు.ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తో ఎన్టీఆర్, చరణ్ ఖాతాలలో అరుదైన రికార్డులు చేరాయి.ఆర్ఆర్ఆర్ వల్ల రాజమౌళి ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు.

రాజమౌళి మహేష్ బాబుతో తర్వాత సినిమాను తెరకెక్కించనున్నారు.మహేష్ సినిమాను కూడా జక్కన్న 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు.

Telugu Lakhs Rupees, Rajamouli, Doop, Imran, Ntr, Ntr Doop, Mahesh Babu, Ntr Doo

మరీ భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తే లాభాలు తగ్గుతాయని రాజమౌళి భావిస్తున్నారని తెలుస్తోంది.రాజమౌళి టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని బోగట్టా.రాజమౌళి త్వరలో ఈ సినిమా స్క్రిప్ట్ పనులపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube