ఈ పారిశుధ్య కార్మికుడి రూటే సపరేటు.. రోడ్డు ఎలా క్లీన్ చేస్తున్నాడంటే..

డిఫరెంట్స్ ఐడియాస్ రావాలేగానీ అనేక అద్భుతాలు సృష్టించవచ్చు.ఇందుకు నిదర్శనమే ఓ పారిశుధ్య కార్మికుడు.

 The Route Of This Sanitation Worker Strange How The Road Is Being Cleaned-TeluguStop.com

వ్యాక్యూమ్ క్లీనర్ తో ఎవరైనా ఇంటిని శుభ్రం చేస్తారు.కానీ అతడు డిఫరెంట్ గా ఆలోచించి రోడ్డును శుభ్రం చేసే వ్యాక్యూమ్ క్లీనర్ కు కనుక్కొన్నాడు.

అతన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.నిజమేనండి.

 The Route Of This Sanitation Worker Strange How The Road Is Being Cleaned-ఈ పారిశుధ్య కార్మికుడి రూటే సపరేటు.. రోడ్డు ఎలా క్లీన్ చేస్తున్నాడంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కావాలంటే అతని గురించి మీకు కూడా తెలుసుకోవాలంటే ఇది చదవండి.మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు గ్రామ పంచాయతిలో పని చేస్తున్న ఓ స్కావెంజర్… ఇంట్లో తొలగించినట్టు గానే.

రోడ్డుపై ఉన్న దుమ్మును, తేలికపాటి చెత్తను తొలగించాలని వెరైటీగా ఆలోచించి తన బుర్రకు పదును పెట్టాడు.పురుగుల మందు కొట్టే యంత్రం సహాయంతో వినూత్నంగా రోడ్డును క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు.

సామాన్యంగా ఈ పంపును పొలంలో పురుగుల మందు చల్లేందుకు ఉపయోగిస్తారు.

కానీ ఈ పారిశుధ్య కార్మికుడు డిఫరెంట్ గా ఆలోచించి దానిని మరో రకంగా ఉపయోగించడం మొదలుపెట్టాడు.

దీనిని చూసిన అందరు మొదట ఆశ్చర్యానికి గురవుతున్నారు.అనంతరం అతన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే సదురు పారిశుధ్య కార్మికుడు ఈ పంపు సహాయంతో రోడ్డును క్లీన్ చేస్తున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు.

Telugu Cleaning Roads, Different Road Cleaning, Gudur Grama Panchayathi, Mahabubabad, New Vaccum Pump, Sanitation Worker, Scavenger, Strange Idea-Latest News - Telugu

దీంతో అది అలా అలా వైరలవుతున్నది.సదురు పారిశుధ్య కార్మికుడి డిఫరేంట్ ఐడియాకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.పలు సినిమా డైలాగులతో అతన్ని మామూలుగా పొగడటం లేదు.

నిజమేమరి కొత్త ఐడియాలతో సరికొత్త ఆవిష్కరణలను సృష్టిస్తే ఆ కిక్కే వేరప్పా.ఆ.మరింకెందుకు ఆలస్యం ఆ వీడియోను మీరు కూడా చూసేయ్యండి.కొత్త ఐడియాలను మీరు సైతం అభినందించండి.

మనలో కూడా కొత్తగా, డిఫరెంట్ గా ఆలోచించే వారిని ఎంకరేజ్ చేయండి.వారికి అండగా నిలవండి, ధైర్యాన్ని ఇవ్వండి.

#Vaccum Pump #Scavenger #Strange Idea #Roads #GudurGrama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు