కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న వ‌ల‌స‌లు.. బీజేపీకి షాక్‌...!

తెలంగాణలో ఇక కాంగ్రెస్ పని అయిపోయిందనుకునే సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా ఏఐసీసీ ప్రకటించింది.దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది.రేవంత్‌రెడ్డి సైతం తనను టీపీసీసీ చీఫ్‌గా నియమించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సీనియర్ నేతలను కలిసి వారి మద్దతు కోరారు.

 The Rising Joining Of Leaders Into Congress Shock To Bjp-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి బయటకు వెళ్లిన సీనియర్ నేతలతోనూ మంతనాలు జరిపారు.ఇంకా జరుపుతున్నారు.మొత్తంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే వారంతా బీజేపీ వైపునకు కాకుండా కాంగ్రెస్ వైపు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు ధర్మపురి సంజయ్, ఓ జిల్లా బీజేపీ అధ్యక్షుడు, ఇంకా పలువురు సీనియర్ నేతలు రేవంత్ ను కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.

వారంతా రేవంత్ నేతృత్వంలో ప‌ని చేసేందుకు రెడీ అన్న‌ట్టు ఇప్ప‌టికే సంకేతాలు కూడా ఇచ్చారు.

 The Rising Joining Of Leaders Into Congress Shock To Bjp-కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న వ‌ల‌స‌లు.. బీజేపీకి షాక్‌…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల్లో ఉన్న సీనియర్లు ఒక్కొక్కరిని కలుస్తున్నారు.

టి.దేవేందర్ గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇతర నేతలను సంప్రదిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేడర్ కూడా మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది.పలు నియోజకవర్గాల్లో యూత్ లీడర్లు కేడర్‌ను బలపరుస్తున్నారు.

Telugu Bjp, Congress, Devender Goud, Dharmapuri Aravind Brother, Dharmapuri Sanjay, Joining Congress, Konda Visweswar Reddy, Revanth Reddy, Telangana Congress-Telugu Political News

ఇటీవల కార్మిక సంఘాల నేతలు ఢిల్లీలో రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సముఖంగా ఉన్నట్లు తెలిపారు.సింగరేణి కార్మిక సంఘాలు సైతం కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి.మొత్తంగా అధికార పార్టీని వ్యతిరేకించే వారు అందరూ కాంగ్రెస్ హస్తాన్ని పట్టుకునేందుకు రావడం చూసి బీజేపీ షాక్‌కు గురువతున్నది.కొద్ది రోజుల కిందట రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను వ్యతిరేకించే వారంతా కమలం గూటికి చేరాల్సిందేననే పరిస్థితులు ఉండగా, తాజాగా అవి మారాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

#Congress #Congress #Devender Goud #Revanth Reddy #Konda Visweswar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు