7 ఏళ్ల బాలికను కుట్టిన 400 తేనెటీగలు.. ఆ బాలిక ఏమైందో తెలుసా?

చిన్న పిల్లలను ఒక చీమ కుడితేనే తట్టుకోలేరు.దోమలు, చీమల నుండి వారిని కాపాడేందుకు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

 The Riot Act A 7 Year Old Braidwood Girl Is Recovering 400-TeluguStop.com

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొన్ని సార్లు అలా జరిగి పోతూనే ఉంటుంది.తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన 7 సంవత్సరాల బాలిక ఈవ్‌ను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 400 తేనెటీగలు కుట్టాయి.

తేనెటీగల విషయం తెలియని ఆ అమ్మాయి వాటి వద్దకు వెళ్లిన నేపథ్యంలో అవి కుట్టడంతో ఆ బాలిక విపరీతంగా ఏడవడం ప్రారంభించింది.విషయం తెలుసుకున్న తల్లి వెంటనే ఆంబులెన్స్‌కు ఫోన్‌ చేయడంతో అక్కడకు ఆంబులెన్స్‌ వచ్చింది.

బాలికకు మొత్తంగా దాదాపుగా 400 తేనెటీగలు కుట్టినట్లుగా డాక్టర్లు నిర్థారించారు.సహజంగా చిన్న పిల్లలకు ఒక్కటి లేదా రెండు తేనెటీగలు కుడితేనే తట్టుకోలేరు.అలాంటప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తి తేనెటీగలు కుట్టడంతో మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే ఈ పాప మాత్రం ఎలాంటి ప్రమాదం లేకుండా బయట పడింది.హాస్పిటల్‌ నుండి చికిత్స పూర్తి చేసుకుని తాజాగా ఇంటికి చేరుకున్న పాప ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉంది.

పాప హాస్పిటల్‌కు చేరుకున్న సమయంలో నేను షాక్‌ అయ్యాను, ఒల్లు అంతా కూడా కందిరీగలు కుట్టడం వల్ల వాచి పోయింది.అంతగా వాచిన ఆ బాలికను చూసి నాకు ఏదోలా అయ్యింది.

ఆ సమయంలో పాప బతకడం కష్టమే అనుకున్నాను.కాని ఆ పాప బలమైనది మరియు తల్లిదండ్రల ప్రార్థన ఫలించి పాప ఆరోగ్యంగా ఇంటికి చేరిందని ఈవ్‌ చికిత్స పొందిన హాస్పిటల్‌లోని ఒక నర్స్‌ మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చింది.

ఈవ్‌ ఇంకా కూడా శరీరంలోని కొన్ని భాగాల్లో వాపు ఉంది.ఆ వాపు అనేది చాలా తక్కువ సమయంలోనే తక్కువ అవుతుందని వైధ్యులు వెళ్లడించడం జరిగింది.

అన్ని తేనెటీగలు కుట్టినా కూడా ఈవ్‌ బతికి బటయ పడటం ఒక వండర్‌గా చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube