ఏళ్ళ తరబడి ప్రపంచాన్ని వేధిస్తున్న చిక్కు ప్రశ్న..చేధించిన అమెరికన్..

కోడి ముందా , గుడ్డు ముందా అనే ప్రశ్న మనం చిన్నతనం నుంచీ వింటూనే ఉన్నాం.ఇది విడదీయలేని చిక్కు ప్రశ్న అనే చెప్పాలి.

 The Riddle That Has Plagued The World For Years The Beaten American , Robert,  J-TeluguStop.com

సమాధానాలు చెప్పలేని ప్రశ్నలు అడగాలంటే ముందుగా ఈ ప్రశ్ననే సంధిస్తారు చాలా మంది.మనలో చాలామంది ఈ ప్రశ్న పై తర్జన భర్జన పడుతూ ఆలోచన చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

అంతెందుకు ఇప్పుడు కూడా మీరు ఈ విషయంపై ఆలోచిస్తూ ఉంటారు కూడా అంత ఫేమస్ ఈ ప్రశ్న.అయితే ఈ చిక్కుముడిని నేను విప్పేసా అంటున్నాడు ఓ అమెరికన్ ఇంతకీ అతడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడా , లేదంటే ఫేమస్ అవ్వడానికి ఏవో కట్టుకధలు చెప్పాడా అనేది చూద్దాం.

అమెరికాకు చెందిన రాబర్డ్ అనే ఓ జర్నలిస్ట్ చిన్నతనం నుంచీ వింటున్న ఈ ప్రశ్నను చెందించాలని అనుకున్నాడు కానీ ఇన్నేళ్ళ కు ఈ ప్రశ్నపై రీసర్చ్ చేయడం కుదరడంతో అన్ని పనులు పక్కకు నెట్టి కేవలం ఈ చిక్కు ముడి విప్పేందుకు ఎంతో శ్రమించాడు.ఎన్నో పరిశోధనల తరువాత తాను సమాధానం కనుగొన్నానని అందుకు సంభందించిన రిపోర్ట్ ను తన జర్నల్ లో ప్రచురించాడు.

ఇంతకీ ఆయన కనుగొన్న సమాధానం ఏంటంటే.

లక్షల ఏళ్ళ క్రితం భూమిపై అసలు కోళ్ళు అనేవి ఉండేవి కావట.

కోళ్ళకు బదులు పెద్ద ఆకారంలో పక్షులు ఉండేవని అయితే కాలంతో వచ్చే జన్యు మార్పులకు గాను అవి కూడా మార్పు చెందాయట అలాంటి పెద్ద పక్షులనే ప్రోటో కోడి అంటారని తెలిపారు.ఇవి అచ్చం కోళ్ళు మాదిరిగానే ఉండేవని కానీ పెద్ద ఆకారంలో ఉండేవని రాసుకొచ్చారు.

తరువాత జరిగిన జన్యు పరిణామాల వలన ప్రస్తుతం ఉన్న కోళ్ళ రూపంలోకి వచ్చాయట.అప్పటి ప్రోటో కోడి పెట్టిన గుడ్లు నేడు మనం పెంచుకునే కోళ్ళు గా రూపాంతరం చెందాయని సో ఈ లెక్కలో గుడ్డే ముందు అంటూ సమాధానం రాసుకొచ్చాడు.

అయితే అతడు ఇచ్చిన వివరణపై మాత్రం ఏ మాత్రం సంతృప్తి చెందటం లేదు నెటిజన్లు.ప్రోటో కోడి తల్లి కోడి అవుతుంది కదా ఆ లెక్కలో కోడి ముందు కదా అంటూ వాదిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube