బాబోయ్.. ధనవంతులు దేశాన్ని వీడుతున్నారట.. ఎందుకో తెలుసా!

ఇండియాలోని ధనవంతులు ఒక్కొక్కరిగా దేశాన్ని వీడుతున్నట్టు తెలుస్తోంది.వీరంతా ఇక్కడి బ్యాంకులను, ప్రభుత్వాన్ని మోసం చేసి ఏమి వెళ్ళడం లేదు.

 Baboy .. The Rich Are Leaving The Country .. Do You Know Why!, Billionaire, Vira-TeluguStop.com

అలా అని వీరు దొంగలు కాదు.ట్యాక్సులు ఎగ్గొట్టిన వారు అంతకంటే కాదు.

కొందరు అలా చేసి ఉండవచ్చు.కానీ, అందరూ అలానే చేస్తారు అనుకోవడం తప్పు.

ఏదేమైనా కన్న తల్లిని, పుట్టిన ఊరును, సొంత దేశాన్ని వదిలి ఎక్కడో విదేశాల్లో సెటిల్ అయ్యేందుకు భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట.ఎందుకో తెలుసుకోవాలని ఉందా.

అయితే ఈ స్టోరీ చదవండి.

మన దేశంలోని ధనవంతుల్లో వందకు ఇద్దరు చొప్పున దేశాన్ని వీడుతున్నట్టు పలు సర్వేలు వెల్లడించాయి.

ఇదేమి ఉత్తమాట కాదు.ఈ విషయాన్న కేంద్రం కూడా ధృవీకరించింది.

దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి చూసుకుంటే అనగా 2014 నుంచి కేవలం నాలుగేళ్లలో 23వేల మంది దేశం దాటారట.ఒక్క 2020లోనే విదేశీ పౌరసత్వం తీసుకుని వెళ్లిపోయిన డబ్బునోళ్ల సంఖ్య మరో 5 వేలు ఉంటుందని సమాచారం.

ఇది దేశంలోని మిలియనర్ల జనాభాలో 2 శాతంగా ఉంది.

పోతే పోనీధనవంతులే కదావారి దగ్గర డబ్బులున్నాయ్ పోతున్నారు అనుకుంటే చాలా పొరపాటు.

వీరంతా భారత్ వదిలి వెళ్లడానికి పలు కారణాలు ఉన్నాయి.ఈ దేశంలో వ్యాపారాలపై భారీగా పన్నులు విధిస్తుండటం, కొత్తగా కంపెనీలు పెడుతామంటే కఠినమైన పర్మిషన్లు, రాజకీయ నాయకుల దోపిడి వంటివి.

అంతేకాకుండా కొన్ని దేశాల పాస్‌పోర్టులకు ఉన్న వెయిటేజీని సొంతం చేసుకోవాలనే కోరిక కూడా కారణమంటున్నారు ఎక్స్‌పర్ట్స్.విదేశాల్లో అయితే నల్లధనాన్ని దాచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.

ఉదా.ఆస్ట్రియా పాస్ట్‌పోర్టు ఉంటే 189 దేశాలకు వీసా అవసరం లేకుండా ప్రయాణించవచ్చు.అదే మనదేశం పాస్ పోర్టు మీద కేవలం 58 దేశాలకు మాత్రమే వెళ్లగలం.

Telugu Astria, Billionaire, India, Maalta, Modi, Rich-Latest News - Telugu

యూరోపియన్ యూనియన్‌లో ఆస్ట్రియా, మాల్టా వంటి దేశాల పౌరసత్వం కలిగియుంటే ఈయూలో ఎక్కడైనా ఉండొచ్చు.ఎవ్వరూ ప్రశ్నించరు.అక్కడ బెస్ట్ ఎడ్యూకేషన్, ఆరోగ్యం కూడా దొరుకుతుందనేది మనవాళ్ల ఆలోచన.

అందుకోసమే ఆస్ట్రియా, మాల్టా, టర్కీ వంటి దేశాల సిటిజన్ షిప్ కోసం భారతీయ మిలియనీర్లు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.వ్యాపార అవకాశాలు, ప్రశాంతంగా గడపాలనుకునే మిలియనీర్లు కెనడా, పోర్చుగల్, ఆస్ట్రియాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారని తెలిసింది.

అయితే, మనదేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితుల వలన కూడా చాలా మంది ధనవంతులు విదేశాలకు వెళ్లిపోతున్నారు.వాస్తవానికి మోడీ హయాంలో ప్రపంచదేశాలు భారత్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నాయని చెబుతుంటే.

మరి మనదేశంలోని ధనవంతులు విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారని ప్రశ్నిస్తే కేంద్రం నుంచి సమాధానం లేదు.మన దేశంలో నేటికి నాణ్యమైన వైద్యం, విద్యను కల్పించకపోవడం వల్లే చాలా మంది విదేశాలకు వలస వెళ్తున్నారని జోరుగా చర్చ నడుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube