ఇండో అమెరికన్ నీరా టాండన్ ను బిడెన్ ఏరి కోరి మరీ అమెరికా ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్ గా నియమించిన విషయం విధితమే.ఆమె నియామకం పట్ల ఎన్నరైలు హర్షం వ్యక్తం చేశారు.
అయితే ఆమె నియామకాన్ని మేము ఒప్పుకోమంటూ పట్టుబట్టారు రిపబ్లికన్ పార్టీ నేతలు.ఆమె ఆ పదవికి అనర్హురాలని బిడెన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అంటున్నారు.
దాంతో ఆమె నియామకం పై అనిశ్చితి నెలకొంది.బిడెన్ ఇప్పటి వరకూ ఎంతో మందిని కీలక పదవులలో కూర్చోబెట్టారు మెజారిటీగా భారతీయ ఎన్నారైలకు కీలక పదవులు ఇచ్చారు.
కానీ ఎవరి నియామకంపై లేని అభ్యంతరం నీరా విషయంలో ఎందుకు చెప్తున్నట్టు.వివరాలలోకి వెళ్తే.
నీరాటాండన్ గతంలో ఎంతో మంది సెనేటర్ల పై బహిరంగ విమర్శలు చేయడమే కాకుండా అభ్యంతరకరమైన ట్వీట్ లు చేస్తూ ఎంతో మందిని ఇబ్బందులు పెట్టిందని, నోటికి వచినట్టుగా మాట్లాడేదని అంటున్నారు రిపబ్లికన్ నేతలు.బిడెన్ ఇప్పటి వరకూ ఎన్నుకున్న వారిలో ఈమె అత్యంత చెత్త నియామకం అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.
ఆమె తమపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆమెతో కలిసి పనిచేయడం మాకు కుదరదని నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఆమె పేరును బిడెన్ ఎప్పుడితే ప్రకటించారో అప్పుడే ఆమె గతంలో ట్విట్టర్ వేదికగా చేసిన సుమారు 1000 కి పైగా ట్వీట్ లను తొలగించిందని, అవి వివాదాస్పదం కాకపోతే ఎందుకు తొలగించిందని అంటున్నారు.రిపబ్లికన్ నేతలు అంతగా పట్టుబట్టానికి కారణం లేకపోలేదు.తిరుగులేని మేజారిటితో గెలిచిన బిడెన్ తన నిర్ణయాలు బేషుగ్గా తీసుకోవచ్చు కానీ ఏ నిర్ణయం అయినా సరే సెనేట్ లో ఆమోదం పొందాలి.
కానీ సెనేట్ లో డెమోక్రటిక్ పార్టీకి 48 సీట్లు ఉండగా రిపబ్లికన్ నేతలకు 50 సీట్లు ఉన్నాయి.అందుకే ఆమెనియామకం పట్ల డెమోక్రటిక్ పార్టీ సెనేటర్స్ అభ్యంతరం తెలుపుతున్నారు.
ఇదిలాఉంటే కీలకమైన మరో రెండు సీట్లకు జనవరి లో ఎన్నికలు జరగనున్నాయి ఇందులో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధిస్తే ఇద్దరికీ చేరి సమానంగా సీట్లు వస్తాయి ఒకవేళ రిపబ్లికన్ పార్టీ గెలుచుకుంటే ఆ పార్టీకి సెనేట్ లో మరింత బలం చేకూరుతుంది.