మాస్కు ఎందుకు పెట్టుకోలేద‌న్న రిపోర్ట‌ర్‌.. అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చిన ఆఫీస‌ర్‌

The Reporter Asked Why The Mask Was Not Put On The Officer Who Gave The Creepy Answer

క‌రోనా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.అది దాడి చేసిన‌ప్పుడు మ‌న వ‌ద్ద దానిని ఎదుర్కోవ‌డానికి కావాల్సిన ప‌రిక‌రాలు, మందులు లేవు.

 The Reporter Asked Why The Mask Was Not Put On The Officer Who Gave The Creepy Answer-TeluguStop.com

స‌రైన మాన‌సిక‌స్థైర్యం కూడా లేదు.కానీ ధీటుగా ఎదుర్కొనేందుకు దేశం స‌ర్వశ‌క్తులూఒడ్డింది.

క‌రోనా వెంటాడుతున్న వేళ ధైర్యం కోల్పోకుండా పోరాడింది.దాని వెనుక ఎంద‌రో అధికారుల‌, పోలీసుల, వైద్య, పారిశుధ్య సిబ్బంది కృషి ఉంది.

 The Reporter Asked Why The Mask Was Not Put On The Officer Who Gave The Creepy Answer-మాస్కు ఎందుకు పెట్టుకోలేద‌న్న రిపోర్ట‌ర్‌.. అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చిన ఆఫీస‌ర్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేశ రాజ‌కీయ నాయ‌కులు కూడా క‌రోనా మ‌హమ్మారిని ఎదుర్కొవాడిని కావాల్సిన చ‌ర్య‌లు తీసుకున్నారు.

క‌రోనా స‌మ‌యంలో హెల్త్ డిపార్ట్ మెంట్ ముందుడి స‌ల‌హాలు సూచ‌న‌లు అంద‌జేసింది.

క‌రోనాపై ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేసింది.ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు విశేష కృషి చేసింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌లు, అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో, ఆరోగ్య శాఖ మంత్రుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దింపులు జ‌రుపుతూ క‌రోనా క‌ట్ట‌డికి కావాల్సిన స‌ల‌హాలు, తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను సూచించింది.క‌రోనా స‌మ‌యంలో చాలా మంది ఆఫీస‌ర్లు, నాయ‌కులు పాపుల‌ర్ అయ్యారు.

క‌రోనా నేప‌థ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ల‌క్ష‌ల మంది లైవ్‌లో చూసేవారు.ఎక్క‌డున్నా మొబైల్‌లో య్యూటూబ్ ద్వారా సీఎం సందేశాన్ని వినేవారు.

అలాగే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ వచ్చే ప్ర‌తీ వీడియో సందేశాన్ని ఆ స‌మ‌యంలో కోట్ల మంది వీక్షించేవారు.

అదే స‌మ‌యంలో రాష్ట్రంలో హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రావు కూడా పాపులర్ అయ్యారు.

Telugu Corona Awareness, Corona Effect, Corona Mask, Corona Vaccine, Health Director Srinivasa Rao, Mask, Media Meeting, Prime Minister Narendra Modi, Srinivas Rao, Telangana Health Director-Latest News - Telugu

అంత వ‌ర‌కు కొంద‌రికి మాత్ర‌మే తెలిసిన ఆయ‌న‌.క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ‌లో చాలా మందికి ప‌రిచయం అయ్యారు.ఆయ‌న పేరు చెబితేనే ఫేస్ గుర్తుకువ‌చ్చేలా ప్ర‌జ‌ల్లో గుర్తింపుపొందారు.అయితే రెండు రోజుల క్రితం ఆయ‌న మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.క‌రోనా నిబంధ‌న‌లు ఎవ‌రూ పాటించ‌డం లేదని, ప్ర‌జ‌ల్లో నిర్ల‌క్ష్యం పెరిగిపోతోంద‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ ధ‌రించి, వ్యాక్సిన్ వేసుకోవాల‌ని సూచించారు.అయితే ఆ స‌మావేశంలో ఆయ‌న మాస్క్ పెట్టుకోలేదు.

మీరు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అని ఓ మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న అదిరిపోయే స‌మాధానం ఇచ్చారు.ప్ర‌జ‌ల్లో మాస్కు ప‌ట్ల అవేర్‌నెస్ పెంచేందుకే ఇలా చేశాన‌ని, ప్ర‌జ‌లు ఇలా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హిరిస్తున్నార‌ని, దానిపై ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఇలా చేశాన‌ని చెప్పారు.

#PrimeNarendra #Srinivasa Rao #Corona Effect #Telangana #Corona Vaccine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube