అవును, అమెరికా నుంచి జపాన్( Japan ) వరకు మాత్రమే కాదు, ఇండియా కూడా వణికిన పరిస్థి వచ్చింది.ఈ మధ్య కాలంలో చూసుకుంటే వాతావరణ మార్పులలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్న పరిస్థితి.
ఈ మార్పులు యావత్ ప్రపంచంపై ప్రతికూల పరిస్థితులను చూపుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.ఈ వేసవిలో హీట్వేవ్తో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో నమోదయ్యాయో అందరికీ తెలిసిందే.
కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు ఇంకా భారీగా పెరుగుతున్నాయి.ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు అంత్యంత ఆందోళనకరంగా ఉండగా.
యూరోప్, పశ్చిమాసియా, జపాన్లు భారీ ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నాయి.ఈ నేపథ్యంలో అమెరికా నుంచి జపాన్ వరకు అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసారు.

దీనంతటికీ కారణం గ్లోబల్ వార్మింగ్( Global warming ) అని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.అది ప్రస్తుతం అమెరికాలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నట్టు సమాచారం.ఈ వారాంతంలో.కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు ఉష్ణోగ్రతలు భయానకంగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు.సాధారణం కన్నా 10 నుంచి 20 డిగ్రీల ఫారెన్హైట్ టెంపరేచర్ నమోదవుతుందని అంచనా.
రాజధాని నగరం ఫీనిక్స్లో వరుసగా 16 రోజుల పాటు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఏసీల్లో కూర్చున్నప్పటికీ.ప్రజలు చెమటలు ఛిందిస్తున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు!

ఇక గ్లోబల్ వార్మింగ్ రెడ్ అలర్ట్ను ఎదుర్కొనేందుకు యూరోప్( Europe ) కూడా సన్నద్ధమవుతోంది.ఇటలీ, రోమ్తో పాటు 16 నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ కావడం గమనార్హం.దాంతో దేశ చరిత్రలోనే అతిపెద్ద హీట్వేవ్కు ప్రజలు సిద్ధంగా ఉండాలి… అని ఇటలీ ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.మరోవైపు ఫ్రాన్స్లో కూడా హీట్వేవ్ పరిస్థితులు దారుణంగా వేధిస్తున్నాయి.
జపాన్లో వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది.అక్కడ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇకపోతే రెండు, మూడు నెలల పాటు హీట్వేవ్తో అల్లాడిన భారతీయులు.ఇప్పుడు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనే విషయం అందరికీ తెలిసినదే.