కాంగ్రెస్ లో ఓటమికి ... టీఆర్ఎస్ విజయానికి కారణం ఏంటి..?

తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేశాయి.ఇక తెలంగాణాలో అధికారం దక్కడం ఖాయం అనుకున్న కూటమిలోని పార్టీలకు ఓటర్లు షాక్ కి గురిచేశారు.

 The Reason Is Why The Mahakutami Failed In Telangana Elections-TeluguStop.com

ముందు నుంచి టీఆర్ఎస్ అధినేత గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.అంతే కాదు ప్రభుతం తెలంగాణ ప్రజలకోసం చాలా చేసిందని… ఆ అభివృద్దే తమ గెలుపుకి బాటలు వేస్తుంది అని ముందునుంచి ఊహించినట్టుగానే ప్రజలు కూడా టీఆర్ఎస్ పార్టీకి భారీ ఆధిక్యం తీసుకువచ్చారు.పోలింగ్ ముగిసిన తరువాత వివిధ సంస్థలు చేసిన సర్వేలు కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయని ప్రకటించాయి.అయితే… ఒక్క లగడపాటి మాత్రమే కూటమి అధికారంలోకి వస్తుంది అంటూ ప్రకటించి అందరిని ఆశ్చర్య పరిచాడు.

టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నిటిని ఒక్కటి చేసి ముందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘెర పరాభవం ఎదురైంది.ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా… విజయం సాధించాలనే నిర్ణయంతో.టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది.మహాకూటమి పేరిట ఎన్నికల బరిలోకి దిగింది.కానీ.గత ఎన్నికల్లో సాధించిన సీట్లు కూడా ఈ ఎన్నికల్లో రాకపోవడం ఆ పార్టీల దుస్థితికి అర్ధం పడుతున్నాయి.

ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చక్రం తిప్పుదామని చుసిన సీనియర్ నాయకులంతా ఓటమిపాలయ్యారు.మహాకూటమి అధికారంలోకి వస్తే.

కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, జానారెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు.సీఎం రేసులో ఉన్నారు.

సీఎం పదవి పక్కన పెడితే.వీరిలో ఉత్తమ్, భట్టి మినహా.మిగతా సీనియర్ నాయకులు ఎవరూ విజయం సాధించలేదు.గత ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్న వీరంతా … ఇప్పడు ఓటమి పాలయ్యి తలెత్తుకోలేని పరిస్థితికి వచ్చారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం.గెలుపు దిశగా పయనమౌతున్నారు.

భట్టి విక్రమార్క విషయానికి వస్తే.మధిర నియోజకవర్గంలో.

ఆయనకు స్వంతంత్ర అభ్యర్థిగా గట్టి పోటీనిస్తున్నారు.ఎన్నికల్లో ఓడిపోవడం సంగతి పక్కన పెడితే.

కీలక నేతలు కూడా ఓటమి పాలవ్వడం కాంగ్రెస్ పార్టీ తలెత్తుకోలేని పరిస్థితికి వచ్చింది.కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందనుకున్నారు.

అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తుతోనే కాంగ్రెస్ తన చేతులతో తానే అధికారాన్ని దూరంచేసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.దీనికి చంద్రబాబు కేసీఆర్ పై చేసిన విమర్శలు కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube