తెలంగాణలో కొత్త పార్టీల హవా ? వీరికి ఇబ్బందే ? 

తెలంగాణ సెంటిమెంటును జనాలోకి బాగా తీసుకువెళ్లి,  పార్టీ పెట్టి,  ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటూ,  చివరకు సక్సెస్ అయ్యారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్అసలు తెలంగాణ పేరు చెప్తే దేశవ్యాప్తంగా గుర్తుకు వచ్చేది కేసీఆర్ మాత్రమే.ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి ఎంతో మంది వ్యక్తుల కృషి , మరెన్నో పార్టీల సహకారం ఉన్నా, ఆ క్రెడిట్ మొత్తం దక్కించుకున్నది టిఆర్ఎస్ పార్టీ,  ఆ పార్టీ అధినేత కేసీఆర్.

 The Reason Is That The Embarrassing Sentiment Of The Telangana Parties With Shar-TeluguStop.com

అందుకే తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.అయితే రాను రాను ఆ సెంటిమెంట్ కాస్త తగ్గుతున్నట్లు గా కనిపిస్తోంది.

దీనికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలే.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో చేస్తామని,  బంగారు తెలంగాణ గా మారుస్తామని,  విద్య ,ఉద్యోగ అవకాశాలు పెద్దఎత్తున కల్పించి , ప్రజలకు ఉపాధి మార్గాలు చూపిస్తామని ఇలా ఎన్నో ఆశలు టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన సమయంలో చెప్పింది.

 మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం పై జనాల్లో ఆ నమ్మకం ఏర్పడింది.కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పరిస్థితి లేదు.

నిరుద్యోగ సమస్య తెలంగాణలో తీవ్రంగా ఉంది.యువత ఈ విషయంపైనే తీవ్ర ఆగ్రహంగా ఉంది.

అయితే కొత్తగా తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల నిరుద్యోగ యువత ను  టార్గెట్ చేసుకుని టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.దీక్షలు చేపట్టారు.

అయితే తాను తెలంగాణ కోడలిని అని,  తెలంగాణ వ్యక్తిని అని పదేపదే షర్మిల చెబుతున్నా, ఆమె మాత్రం ఆంధ్ర వ్యక్తిగానే అంతా చూస్తున్నారు.  తెలంగాణలో పార్టీకి ఆదరణ రావడానికి కారణం తెలంగాణ సెంటిమెంట్ తగ్గడమే కారణం.

  టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరగడం,  ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడడం,  బిజెపి పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వంటి కారణాలతో పార్టీకి కాస్త ఆదరణ లభిస్తోంది.

Telugu Congress, Janasena, Pavan Kalyan, Telangana, Ys Sharmila-Telugu Political

ఇక ఏపీలోనూ అంతంత మాత్రంగా ఉన్న జనసేన పార్టీ, ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో పోటి చేస్తుంది.  అయినా ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోవడానికి కారణం తెలంగాణ సెంటిమెంటు తగ్గడం కారణంగా కనిపిస్తోంది.  ప్రస్తుతం అక్కడ పార్టీ ఉన్నా, అంతంత మాత్రంగానే ఉండటంతో ఆంధ్ర పార్టీలు గా పేరుపొందిన జనసేన , షర్మిల పార్టీలకు ఆదరణ పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇదంతా టీఆర్ఎస్ స్వయం కృపరాధంగానే కనిపిస్తోంది.ఇప్పుడు ఏపీ పార్టీ గా పేరు పొందిన షర్మిల పార్టీకి ఆదరణ పెరుగుతూ వెళ్తే రాజకీయంగా బిజెపి, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు ఇబ్బందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube