'జబర్దస్త్' లో హైపర్ ఆది కనిపించకపోవడానికి కారణం ఇదేనా.? ఆక్సిడెంట్ అయ్యిందా.?     2018-11-08   11:29:11  IST  Sai Mallula

వినోదం కి మనం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాము. అంతలా వీక్షిస్తాము మనం “జబర్దస్త్” ప్రోగ్రాం ను. ముక్యంగా “హైపర్ ఆది” స్కిట్స్ కి అయితే ఫాన్స్ చాలా మందే అని చెప్పాలి. యూట్యూబ్ లో వ్యూస్ ఏ దీనికి సాక్షం. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాపిక్స్ కి తన స్టైల్ లో పంచ్ వేసి అందరిని అలరిస్తుంటాడు.

The Reason For Hyper Aadi Not In Jabardasth Show-

The Reason For Hyper Aadi Not In Jabardasth Show

అయితే ఇటీవల కొంత కాలంగా హైపర్ ఆది జబర్దస్త్‌లో కనిపించడంలేదు. దీంతో ఆయన ఈ కామెడీ షోకు దూరమైపోయారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా హైపర్ ఆదికి యాక్సిడెంట్ అయ్యిందని, నాగబాబుతో పాటు జబదర్దస్త్ టీం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి.

The Reason For Hyper Aadi Not In Jabardasth Show-

ఈ అబద్ధపు వార్తలపై హైపర్ ఆది తాజాగా స్పందించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తనకు యాక్సిడెంట్ అయ్యిందని ఒక చెత్త న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని, తాను బాగానే ఉన్నానని ఆ వీడియో మెసేజ్ ద్వారా ఆది చెప్పారు. పుకార్లు నమ్మొద్దని, తాను చాలా బాగున్నానని వెల్లడించారు. అంతేకాకుండా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

The Reason For Hyper Aadi Not In Jabardasth Show-

ఇది ఇలా ఉంటె..ప్రస్తుతం సినిమాలు, విదేశీ ప్రదర్శనలతో హైపర్ ఆది చాలా బిజీగా ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తరఫున ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ కార్యకలాపాలతో బిజీగా ఉండటంతో జబర్దస్త్‌కు సమయం కేటాయించలేక కొన్నాళ్లు దూరమయ్యారు. ఈ వీడియో కోసం క్లిక్ చేయండి..