పార్వతీదేవి అన్నపూర్ణ దేవిగా అవతరించడానికి గల కారణం ఏమిటో తెలుసా?

ఈ ప్రపంచంలో ఏ ప్రాణకోటి బతకాలన్న తప్పనిసరిగా ఆహారం అవసరమవుతుంది.మనిషి నుంచి చిన్న క్రిమికీటకాల వరకు ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఆహారం ఎంతో అవసరం కనుక సాక్షాత్తు ఆ పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరిగా అవతరించింది భక్తులకు సమస్త ప్రాణకోటికి ఆహారాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.

 The Reason For Goddess Parvati Becoming Annapurna, Goddess Parvathi, Annapurna,-TeluguStop.com

ఈ క్రమంలోనే మనం దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా పూజిస్తాము.అసలు పార్వతి దేవి అన్నపూర్ణ దేవిగా మారడానికి గల కారణం ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పార్వతీదేవి అన్నపూర్ణ దేవిగా అవతరించడానికి పురాణాలలో ఒక కథ ఉంది.త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుడు ఎంతో గర్వంతో విర్రవీగే వాడు.ఈ క్రమంలోనే బ్రహ్మదేవుని గర్వాన్ని అణచివేయాలని, పరమేశ్వరుడు బ్రహ్మ తలలో ఒక తలని ఖండించడంతో బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంది.ఈ క్రమంలోనే పరమేశ్వరుడికి విపరీతమైన ఆకలి పుట్టడంతో ఆకలి బాధలు తీర్చుకోవడం కోసం పరమేశ్వరుడు యాచకుడిగా అవతరిస్తాడు.

Telugu Annapurna, Bramha, Lard Shiva, Goddessparvati-Telugu Bhakthi

ఈ విధంగా యాచకుడిగా బిక్షాటన చేస్తున్నటువంటి పరమశివుడికి సాక్షాత్తు పార్వతీ దేవి అన్నపూర్ణాదేవిగా అవతరించి ఆ బిక్ష పాత్రలో అన్నం పెట్టగానే ఆ భిక్షపాత్ర నిండాలి అన్నది విధి.ఈ క్రమంలోనే పరమేశ్వరుడికి భిక్ష వేయడం కోసం సాక్షాత్తు పార్వతీ దేవి అన్నపూర్ణగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.ఈ విధంగా పార్వతీదేవి అన్నపూర్ణగా మారి పరమేశ్వరుడికి భిక్ష వేయటం వల్ల పరమేశ్వరుడికి బ్రహ్మ తలను ఖండించడం వల్ల కలిగినటువంటి బ్రహ్మహత్యా దోషం పోతుంది.ఈ క్రమంలోనే దేవి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి అన్నపూర్ణా దేవి అలంకరణ చేసి, భక్తులకు దర్శనం ఇస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube