'సోహైల్'కు ఓటెయ్యమంటున్న సీఎం జగన్ ఫ్యాన్స్.. కారణం అదే!

స్టార్ మాలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కేవలం 3 రోజుల్లో గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం హౌస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో బిగ్ బాస్ విజేత ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

 The Reason Cm Jagan Fans Who Are Voting For Sohel, Sohel, Ys Jagan, Bigg Boss Te-TeluguStop.com

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో అభిజిత్ కు అధికంగా ఓట్లు పడడంతో అతడు విజేతగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఎంతో ఆశ పడుతున్న సమయంలో హౌస్ లో ఉన్న మరో కంటెస్టెంట్ సోహెల్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కాకముందు సోహెల్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ఇంటర్వ్యూలో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.

జగన్ ఎంతో మొండిగా కష్టపడి పాదయాత్ర చేసి ఎన్నో హామీలను ఇచ్చారు.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతున్నారు.అందులో ముఖ్యంగా విద్య, బయటకు పెద్దపీట వేశారని జగన్మోహన్ రెడ్డి గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు.ఇలా జగన్ గురించి గొప్పగా మాట్లాడుతున్న సోహెల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సోహైల్ జగన్ గురించి మాట్లాడిన తీరు, ప్రస్తుతం జగనన్న అభిమానులను ఆకట్టుకుంది.దీంతో జగన్ అభిమానులు సైతం సోహెల్ కు అభిమానులుగా మారిపోయారు.దీంతో సోహెల్ కు ఓట్లు వేయమని జగన్ అభిమానులు పెద్ద ఎత్తున సోహెల్ కు సపోర్ట్ చేయడం విశేషం.దీంతో బిగ్ బాస్ విజేత అభిజిత్ అని అనుకున్న వాళ్లు ప్రస్తుతం అయోమయంలో పడ్డారు.

దీంతో బిగ్ బాస్ విన్నర్ ఎవరనే దానిపై మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పవచ్చు.సోహెల్ మాట్లాడిన తీరు ప్రస్తుతం అతనికి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు.

దీంతో ఈ వారం సోహెల్ కి కూడా పెద్ద సంఖ్యలో ఓట్లు పడే అవకాశం ఉండడంతో బిగ్ బాస్ విన్నర్ ఎవరని తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube