ఆ .. పొగడ్తల వెనుక 'మెగా' రీజన్ ఏంటి  

The Reason Behind The Megstar Praises To The Kcr-

మెగా స్టార్ చిరంజీవి ఉన్నట్టు ఉండి తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆయన ఆహా ఓహో అంటూ తెగ పొగిడేసాడు. అయితే దీని వెనుక పరమార్ధం ఏంటో మాత్రం ఎవరికీ అంతుపట్టడంలేదు..

ఆ .. పొగడ్తల వెనుక 'మెగా' రీజన్ ఏంటి -The Reason Behind The Megstar Praises To The KCR

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి జనసేనలో చేరబోతున్నాడు అని వార్తలు ఒకవైపు వస్తుండగా… మరోవైపు జనసేన పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు పలకబోతోంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ‘చిరు’ వాక్యాలు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. ఎన్నికల సమయంలో మెగా పొగడ్తల వెనుక పరమార్ధం ఏంటి అనే సందిగ్ధంలో ఇప్పడు అంతా అనేక సందేహాలు వెళ్లబుచ్చుతున్నారు.

తాజాగా … సంతోషం సినిమా అవార్డు కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశంసించారు. మనదేశంతోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

అనంతరం హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ ఇన్ని హంగుతలో ఉందంటే అందుకు కారణం సీఎం కేసీఆర్ అని చెప్పారు. నిజంగానే కేసీఆర్ ఒక సర్వేలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారని తెలిపారు..

‘కేసీఆర్ మాటల ముఖ్యమంత్రి కాదని, చేతుల ముఖ్యమంత్రని’ ఆయన పని ఆయన చేసుకుంటు వెలతారని అందుకే ఇంత అరుదైన గౌరవం దక్కిందని అన్నారు.

నేను కేసీఆర్ కలిసింది కేవలం ఒకే ఒక్కసారని కలినప్పుడు కూడా హైదరాబాదులో చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేందుకు ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ చెప్పారని చిరంజీవి అన్నారు. చిత్ర పరిశ్రలో ఓ సీనియర్ నటుడిగా ఇంకా ఏమైనా లోటు పాట్లు ఉంటే తప్పకుండా వాటిని పూర్తి చేస్తానని చెప్పాడని చిరు తెలిపారు.

సినీ పరిశ్రమపై ఆయనకున్న మక్కువకు ఇది నిదర్శనమని… చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాలని కేసీఆర్ భావిస్తుడటం ఇండస్ట్రీ అదృష్టమని అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేసాడు. ఈ స్థాయిలో చిరు నుంచి వ్యాఖ్యలు వినిపించడం వెనుక జనసేనాని వ్యూహం ఏమైనా దాగి ఉందా .

? పవన్ టీఆర్ఎస్ కి ప్రత్యక్షంగా కాకుండా ఈ స్థాయిలో టీఆర్ఎస్ కి మేలు జరిగేలా వ్యవహరిస్తున్నాడా అనే అనేక అనుమానాలు మొదలయ్యాయి.