నాగబాబు యూట్యూబ్ ఛానెల్..అసలు స్టొరీ ఇదీ..???  

The Real Story Behind Channel Of Nagababu-janasena Party,kakinada Janasena Candidate,nagababu,nagababu Channel,pawan Kalyan Janasena

రాజకీయ నేతలు ఒక పని చేస్తున్నారు అంటే దానివెనుక అర్థాలు,ప్రతిపదార్ధాలు, సంధులు ,సమాసాలు చాలానే ఉంటాయి. అబ్బో ఆ లెక్కలే వేరులెండి. నేను ఇందంతా కావాలని చేయడం లేదు, ఇందులో రాజకీయం అసలే లేదు..

నాగబాబు యూట్యూబ్ ఛానెల్..అసలు స్టొరీ ఇదీ..???-The Real Story Behind YouTube Channel Of Nagababu

అంటూ వ్యాఖ్యలు చేస్తారు, బహిరంగంగానే రాజకీయం చేస్తారు, ప్రజల్ని అయోమయంలో నెట్టడానికి ప్రయత్నిస్తారు. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసేస్తారు. ఈ వ్యవహారంలో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఏ పార్టీ అయినా సరే చేసేది జిమ్మిక్కులే.

సరే అసలు విషయంలోకి వెళ్తే.

నాగబాబు గత కొంతకాలంగా రాజకీయ విమర్శలు చేస్తూ ఏపీలో హీట్ పెంచిన విషయం విధితమే. బాలయ్య బాబు పై కూడా నాగబాబు విమర్సలు చేశారు కూడా,ఇలా వరుసపెట్టి జగన్ , చంద్రబాబు లపై కూడా తారా స్థాయిలో రెచ్చి పోయారు నాగబాబు. ఈ విమర్శలు కేవలం తన వ్యక్తిగతమని ఇందులో తన తమ్ముడి ప్రమేయం లేదని ముందుగానే ముందుమాటలో చెప్పిన నాగబాబు తన తమ్ముడికి లబ్ది చేకూరేలా ఈ ఛానెల్ పెట్టారనేది జనమెరినగ సత్యం.

అయితే నాగబాబు యూట్యూబ్ ఛానెల్ పెట్టడానికి అసలు కారణం వేరే ఉందని, ఇది పక్క రాజకీయ కోణంలో అమలు జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఛానెల్ కి కాకినాడ ఎంపీ స్థానానికి ముడిపెడుతున్నారు కొంతమంది విశ్లేషకులు. ఎందుకంటే కాకినాడ ఎంపీ అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ నాగబాబు ని బరిలోకి దించాలని ముందుగానే డిసైడ్ అయ్యారట..

అందుకు కారణం లేకపోలేదని తెలుస్తోంది. గతంలో కాకినాడ నుంచీ పీర్పీ కోసం పని చేసిన చలమల శెట్టి సునీల్ ఈ సారి జనసేన నుంచీ పోటీ చేస్తారని భావించారట. కాని అనుకోని కారణాల ద్వారా ఆయన టీడీపీ ఎంపీగా ఫిక్స్ అవ్వడంతో.

సునీల్ ని డీ కొట్టే వ్యక్తి ఎవరు ఉన్నారని లోకల్ గా ఎంతమందిని పరీక్షించినా ఎవరికీ ఆ సత్తా లేకపోవడంతో ఇక తప్పక నాగబాబు ని సునీల్ కి ప్రత్యర్ధిగా బరిలో దించుతున్నారని తెలుస్తోంది. ప్రరాపా నుంచీ నాగబాబు కి కాకినాడలో మంచి పట్టు ఉంది. కాపు వర్గం నేతలు మొదలు, శెట్టి బలిజలు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో నాగబాబు కి సన్నిహితులు లెక్కకి మించి ఉన్నారట. దాంతో సునీల్ కి పోటీగా నాగబాబు ని బరిలోకి దించడానికి ముందుగానే డిసైడ్ అయిన పవన్ తన అన్నకి పరిస్థితులు వివరించాడని, అందుకు తగ్గట్టుగానే వార్తల్లో వ్యక్తిగా నిలవడానికి నాగబాబు యూట్యూబ్ ఛానెల్ పెట్టరనని విశ్లేషకులు అంటున్నారు.

ఇదే నిజమైతే పవన్ రాజకీయం ఎంతవరకూ కలిసొస్తుందో వేచి చూడాల్సిందే.