పెంపుడు జంతువులుగా చాలా మంది తమ ఇళ్లలో కుక్కలను, పిల్లులను పెంచుకుంటూ ఉంటారు.మరి కొందరు అయితే ఏనుగులు, గుర్రాలను, పక్షులను కూడా పెంచుకోవడానికి ఇష్టపడతారు.
ఇంకొందరు అయితే ఇంట్లో చేపలు, తాబేళ్లను కూడా పెంచుతారు.అయితే మీరు ఎప్పుడైనా కప్పలను పెంచే వారి గురించి విన్నారా.? విని వుండరు కదా.మాములుగా మనం వర్షాకాలంలో కప్పలను ఎక్కువగా చూస్తూ ఉంటాము.బెకబెకమంటు అరుస్తూ అందరిని బయపెడుతూ ఉంటాయి.కొందరు అయితే కప్పలను చూసి భయంతో ఆమడ దూరం పరుగేడతారు కూడా.
కానీ ఒక వ్యక్తి మాత్రం తన ఇంటి తోటలో ఏకంగా లక్షల సంఖ్యలో కప్పలను పెంచుతున్నాడు.అసలు ఎందుకు అన్ని కప్పలను పెంచుతున్నాడా అనే అనుమానం మీకు రావచ్చు.
మీ అనుమానం తీరాలంటే అసలు వివరాలు తెలుసుకోవాలిసిందే.ఈ కప్పలకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది.ఈ వీడియో ప్రకారం బ్రిటన్ లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఇంటి తోటలో లక్షల కొద్ది కప్పలను పెంచుతున్నాడు.
ఆ కప్పలను చూస్తే ఒక కప్పల సైన్యాన్ని తయారు చేసినట్లు తెలుస్తుంది.తన ఇంటి తోటలో దాదాపు 1.4 మిలియన్ కప్పలను పెంచుతున్నట్లు తెలుస్తుంది.ఈ కప్పల సైన్యంలో చిన్నా పెద్ద అన్ని కప్పలు కలిసి ఉన్నాయి.
అవన్నీ ఒక చోట నుంచి మరొక చోటకు గెంతులు వేస్తున్నాయి.ఆ వ్యక్తి మొదట కప్పల గుడ్లను నీటిలో ఉంచినట్లు వీడియోలో మీరు చూడవచ్చు.ఆపై తోటలో ఎక్కడ చూసినా కప్పలు మాత్రమే మనకు దర్శనం ఇస్తున్నాయి.ఇప్పుడు అక్కడ మొత్తం కప్పలే.
మనుషులు తిరిగేందుకు కూడా స్థలం లేదనే చెప్పాలి.ఆ వ్యక్తి 95 రోజుల క్రితం 1.4 మిలియన్ కప్ప గుడ్లను నీటిలో ఉంచినట్లు వీడియోలో తెలుస్తోంది.అతను కప్పల పెంపకంపై ఏదో ఒక ప్రయోగంగా వాటిని పెంచినట్లు తెలుస్తుంది.
కానీ వీడియోలో మాత్రం అతను ఎందుకు పెంచుతున్నాడో అనే విషయం పట్ల క్లారిటీ లేదు.ఈ వీడియో చూసిన నెటిజన్స్ అందరు అసలు ఆ వ్యక్తి ఎందుకు అలా అన్ని కప్పలను పెంచుతున్నాడో అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.