ప్రణయ్ ను హత్య చేయించిన అమృత తండ్రి 'మారుతి రావు' గురించి బయటపడ్డ నిజాలివే.! ఒకప్పుడు స్కూటర్ పై.?

అమృత వర్షిణిని, ప్ర‌ణ‌య్.ప్ర‌స్తుతం తెలుగు ప్ర‌జ‌ల్ని అవేద‌న‌కు గురిచేస్తున్న ప్ర‌మేజంట‌.

 The Real Facts About Amrutha Father-TeluguStop.com

అరు మాస‌ల క్రితం పెద్ద‌ల‌ను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని త‌మ బ్ర‌తుకు తాము బ్ర‌తుకుతున్న‌.ప్రేమ ప‌క్షులు.

త‌మ అనురాగానికి ప్ర‌తిఫ‌లంగా త్వ‌ర‌లొనే త‌మ ఇంట మ‌రో మ‌నిషిరాబోతున్నాడ‌ని సంబుర‌ప‌డేలోపే.విధి వారితో అడుకుంది.

అమాయి తండ్రే కాల‌య‌ముడ‌య్యి.క‌క్ష‌క‌ట్టి వారిని విడ‌దీసాడు.

ప్ర‌ణ‌య్ ను అత్యంత దారుణంగా హ‌త‌మార్చాడు.ప్రణయ్‌ను హత్య చేయించిన మారుతీరావుకు నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలింది.

తన కూతురు ప్రేమ వివాహం చేసుకొంటే మారుతీరావు సహించలేకపోయాడు.అంతేకాదు తక్కువ కులానికి చెందిన ప్రణయ్ తన కూతురును పెళ్లి చేసుకోవడంతో ప్రణయ్ ను కిరాయి హంతకులతో హత్య చేయించాడు.

అతనికి సెటిల్‌మెంట్‌లు, దందాలు, కబ్జాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.రాజకీయ నాయకుల పలుకుబడితో అధికారులను సైతం తన బుట్టలో వేసుకుని ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం.25 ఏళ్ల క్రితం మిర్యాలగూడ పట్టణంలో ఒక్క చిన్న స్కూటర్‌పై తిరిగే అతను అనతికాలంలోనే కోట్ల రూపాయలకు అధిపతిగా చెలామణి అయ్యాడు.తనతోపాటు తన తమ్ముడు శ్రవణ్‌తో కలిసి కిరోసిన్‌ దందా నిర్వహించిన మారుతీరావు భూ కబ్జాదారుడిగా అవతారమెత్తి కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూకబ్జాల్లో సుపారీ గ్యాంగ్‌లతో సంబంధాలు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడేవారని స్థానికులు చెబుతున్నారు.దీంతో పాటు మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పాగా వేసి తన పేరున మార్పిడి చేసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది.20 ఏళ్ల క్రితం మిర్యాలగూడ తహసీల్దార్‌గా పనిచేసిన ఓ రిటైర్డ్‌ అధికారి అండ దండలతో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ఇటీవల మిర్యాలగూడ పట్టణ సమీపంలో 626 సర్వే నంబర్‌లో ఉన్న భూమిని ఆక్రమించుకున్నట్లుగా షెడ్యూల్డ్‌ కులాల వారు ఆందోళనలు నిర్వహించగా మారుతీరావు చేతిలో ఉన్న 20 కుంటల భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది.అదే విధంగా సర్వే నంబర్‌ 716, 756 లలో కూడా ప్రభుత్వ భూములను బినామీల పేరుతో కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.అదేవిధంగా చింతపల్లిలో రోడ్డు పక్కన, అద్దంకి – నార్కట్‌పల్లి రోడ్డు వెంట మరికొంత భూమి ఉండగా దానిలో ఒక గది నిర్మించి సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

ఆయనకు మొదటి నుంచి కూడా అధికార పార్టీ అండదండలు ఉండేవి.రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయా నాయకులతో మంచి సంబంధాలను పెట్టుకునేవారు.ఎ లాంటి వివాదాలు వచ్చినా వారి అండదండలతో ఆస్తులు సంపాదించారు.రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాడు.

ఆయన దందాలకు పార్టీ పెద్దల అండదండలు ఉంటాయని భావించి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీలో చేరడం ఆయన నైజం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube