రైల్ టికెట్ బుకింగ్ లో ఆ విషయం పై క్లారిటీ ఇచ్చిన రైల్వేశాఖ..!

రైలు టికెట్ బుక్ చేసేవారికి గుడ్ న్యూస్ రైలులో మామూలుగా మనం ఏ బెర్త్ కావాలంటే ఆ బెర్త్ రాదు.రైలు ఖాళీగా ఉన్నప్పుడే ఆవిధంగా జరిగే అవకాశం ఉంది.

 The Railways Has Given Clarity On The Matter In Train Ticket Booking . Train, Ti-TeluguStop.com

అయితే రైలు రద్దీగా ఉండేటప్పుడు బెర్తుల కేటాయింపు అనేది ఐఆర్‌సీటీసీ ఇ-టికెటింగ్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి.రైలు టికెట్ బుకింగ్ అనేది చాలా మందికి తెలీదు.

అందులోని నియమాలు, నిబంధనలు తెలియకపోవడం వల్ల ప్రయాణికులు తికమకపడిపోతుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ సిటిజన్లకు రైలు సీట్ల కేటాయింపు విషయంలో ప్రయాణికుల్లో అనేక డౌట్స్ ఉంటాయి.

సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ ఎంతో అవసరం.అయితే వాటి కేటాయింపు విషయంలో ప్రయాణికులు ట్విట్టర్‌ లో అడిగిన ప్రశ్నలకు భారతీయ రైల్వే కొంత వివరణ అనేది ఇచ్చింది.

సీనియర్ సిటిజన్స్ కు రైలు టికెట్ బుక్ చేసినా లోయర్ బెర్త్ రాలేదని ప్రయాణికులు రైల్వేను అనేకమార్లు ప్రశ్నించారు.అయితే ఇద్దరు సీనియర్ సిటిజన్లు లేదా ఒక సీనియర్ సిటిజన్, వారితో పాటు మరో ప్యాసింజర్ ఉంటే ఐఆర్‌సీటీసీ ఇ-టికెటింగ్ సిస్టమ్ పరిగణలోకి తీసుకోదని భారతీయ రైల్వే తేల్చి చెప్పింది.

దీనిబట్టీ చూస్తే కేవలం ఒక సీనియర్ సిటిజన్ పేరుతో రైలు టికెట్ బుక్ చేస్తే లోయర్ బెర్త్ వస్తుందని చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం.ఒకవేళ ఇద్దరు సీనియర్ సిటిజన్లు లేదా ఒక సీనియర్ సిటిజన్, వారితో పాటు మరో ప్యాసింజర్ ఉంటే లోయర్ బెర్త్‌ ను ఆటోమెటిక్‌ గా పరిగణలోకి తీసుకోదని తెలుసుకోవాలి.

అంతేకాకుండా లోయర్ బెర్త్ లేదా సీనియర్ సిటిజన్ కోటా బెర్త్ 60 ఏళ్లు పైబడిన పురుషులకు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు మాత్రమే ఇది వర్తిస్తుందని రైల్వే తెలియజేసింది.

Telugu System, Key, Railways, Senior Citizens, Tickets, Train-Latest News - Telu

అది కూడా ఒంటరిగా లేదా ఇద్దరు ప్రయాణికులతో వెళ్లేప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుందని రైల్వే తెలియజేసింది.అయితే ఇద్దరు సీనియర్ సిటిజన్లు లేదా ఒక సీనియర్ సిటిజన్ వారితో పాటుగా ఇంకా మరో ప్యాసింజర్ ప్రయాణిస్తే సిస్టమ్ లోయర్ బెర్తును పరిగణలోకి తీసుకోదని తెలుసుకోవాలి.ఈ విషయాన్నే రైల్వే తెలియజేసింది.

దీంతో ఈ విషయం సంబందించి రైల్వే ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube