వైరల్: మహిళను మింగేసిన కొండచిలువ.. చూస్తే గుండె గుబేలే..

ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటాం.తాజాగా ఓ కొండచిలకు సంబంధించిన విషయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.

ఇండోనేషియా( Indonesia ) దేశంలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది.45 ఏళ్ళున్న ఓ మహిళని కొండచిలువ అమాంతంగా మింగేసింది.అచ్చం సినిమాలలో చూపించిన మాదిరిగానే ఆ మహిళను కూడా కొండచిలువ అమాంతం మింగేసింది.

దక్షిణ సులవేసి ఫ్రావిన్స్ లోని కాలెప్పింగ్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల ఫరీదా అనే మహిళ గురువారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు.ఆ మహిళ భర్త ఆమె కోసం ఎంత వెతికిన ఫలితం లేకపోయింది.అయితే అతను తన భార్యను వెతికే సమయంలో ఓ ప్రాంతంలో గాలించిన సమయంలో అక్కడ ఆమె సంబంధించిన వస్తువులు అతడు గుర్తించాడు.

ఆ ప్రాంతంలో తన భార్యను వెతుకుతుండగా ఓ పెద్ద కొండచిలువ( Python ) కనబడింది.అయితే ఆ సమయంలో కొండచిలువ కడుపు భాగం చాలా పెద్దదిగా ఉండి ఉండడంతో భర్తకు అనుమానం వచ్చింది.

దీంతో వెంటనే అతడు అటవీశాఖ పోలీసులకు సమాచారం అందించాడు.

Advertisement

దీంతో అటవీ అధికారులు హుటా కొట్టిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న కొండచిలువ పొట్ట భాగాన్ని కోసి చూశారు.దాంతో అసలు విషయం బయటపడింది.కొండచిలువను కోయగా మహిళ తల బయటపడింది.

దీంతో మహిళ భర్త ఆవిడ తన భార్య అని కన్ఫామ్ చేశాడు.అయితే అలాంటి ప్రదేశాలలో కొండచిలువలు కామన్ అంటూ పోలీసులు తెలిపారు.

ఇలాంటి సంఘటనలు ఆ ప్రాంతంలో ఇదివరకు కూడా జరిగాయని అక్కడ ప్రజలు తెలుపుతున్నారు.

షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..
Advertisement

తాజా వార్తలు