అదేంటో గానీ ఈ మధ్య కొండ చిలువలు కూడా ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి.ఒకప్పుడు పాములు మాత్రమే ఇండ్ల దగ్గర కనిపించేవి.
కానీ కొండ చిలువలు మాత్రం కేవలం అడవుల్లోనే కనిపించేవి.వాటిని చూడాలన్నా కూడా అడవులకు వెళ్లాల్సిందే.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.ఇప్పుడు కొండ చిలువలే ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి.
కొండ చిలువలు ఎంత డేంజరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వాటి దగ్గరకు ఎలాంటి జంతువులు వచ్చినా సరే అమాంతం మింగేస్తుంటాయి.
అందుకే వీటి జోలికి ఏ జంతువులు కూడా వెళ్లవు.
ఒక్కోసారి సింహాలు, పులులు కూడా దీని జోలికి వెళ్లాలంటే వణికిపోతాయి.
అత్యంత భయంకరమైన మొసళ్లను కూడా కొండ చిలువలు మింగేసిన సందర్భాలు ఉన్నాయి.ఇంత భయంకరమైన కొండ చిలువలు ఇప్పుడు ఇండ్లలోకి రావడం అందరినీ కలవరపెడుతున్నాయి.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే వైరల్ వీడియోలో కూడా ఓ కొండ చిలువ ఇలాగే ఇంట్లోకి వచ్చేసింది.అయితే అది మెల్లిగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి మెట్ల పక్కన ఉన్న కట్టె మీద పాకుతూ పోతోంది.
థాయ్‌లాండ్ కు చెందిన ప్రావిన్స్‌లో ఉండే ఓ ఇంట్లోకి ఇలా కొండ చిలువ ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఆ మహిళ భోజనం చేసిన తర్వాత ఏదో పనిమీద పైకి చూడటంతో రెండో అంతస్తులోకి ఎక్కుతున్న కొండ చిలువ ఆమెకు కనిపించింది.దీంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోయింది.వెంటనే ఆమె స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించింది.
అతను వచ్చి దాన్ని పట్టుకునేందుకు నానా తిప్పలు పడ్డాడు.దీన్నంతా కూడా కొందరు వీడియో తీయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఈ పాము ఇంత సైలెంట్ గా ఎంట్రీ ఇస్తోందేంటి అని అందరూ భయపడుతూ ఎమోజీలను జతచేసి కామెంట్లు పెట్టేస్తున్నారు.