షాపింగ్ మాల్‌కు వ‌చ్చిన కొండ‌చిలువ‌.. చివ‌ర‌కు..!

మనం షాపింగ్​ మాల్​కు ఎందుకెళ్తాం ? ఇదేం పిచ్చి ప్రశ్న అంటారా ? ఎవరైనా షాపింగ్​ చేయడానికే వెళ్తారు.ఇదే కదా మీ సమాధానం.

 The Python That Came To The Shopping Mall To The End , Konda Chiluva, Shopping-TeluguStop.com

దాదాపు అందరు షాపింగ్​ మాల్స్​కు షాపింగ్ చేయడానికే వెళ్తారు.కానీ కొందరు మాత్రమే టైం పాస్​ చేయడానికి వెళ్తారు.

అది వేరే విషయం అనుకోండి.

అయితే మనుషులు సాధారణంగా షాపింగ్​ మాల్​ కు వెళ్లి వారికి అవసరమైన బట్టలు, ఇతర వస్తువులు కొనుక్కుంటారు.

మరి కొందరు వారి బంధువుల కోసం, స్నేహితుల కోసం బట్టలు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారు.కానీ ఈ మధ్య ఓ చోట కొండ చిలువ కూడా షాపింగ్​కు వచ్చింది తెలుసా ? అవునా ? ఇది నిజమా అని అనుకుంటున్నారా.అవునండి నిజం.ఇంతకీ ఎక్కడ ఆ షాపింగ్​ మాల్​.

ఎంటా విషయం.

Telugu Konda Chiluva, Python, Mall, Python Mall-Latest News - Telugu

అమెరికాలోని లూసియాన పట్టణంలో ఓ బ్లూ అక్వేరియం ఉన్నది.ఇందులో రకరకాల పాములు ఉంటాయి.అయితే ఇందులో నుంచి కారా అనే పేరు గల కొండ చిలువు రెండు రోజుల నుంచి కనిపించడం లేదు.

దీని పొడవు 12 అడుగులు.అయితే పకడ్బందీగా ఎన్ క్లోజర్​లో ఉండే భారీ కొండ చిలువ ఎలా తప్పించుకున్నది అనే విషయం ఆ జూ సిబ్బందికి అంతు పట్టలేదు.

దాని కోసం చాలా వెతికారు కానీ కనిపించ లేదు.ఈ లోపు ఆ జూ పక్కనే ఉన్న షాపింగ్​ మాల్​ సిబ్బంది నుంచి ఆ జూ అధికారులకు ఓ సందేశం వచ్చింది.

అదేంటంటే తమ షాపింగ్​ మాలో ఓ పాము తోక కనిపిస్తోందని, అది కొండ చిలువ తోక కావచ్చని అనుమానంగా ఉందని దాని సారంశం.వెంటనే జూ అధికారులు, సిబ్బంది అక్కడి చేరుకున్నారు.

అక్కడ ఉన్నది కొండ చిలువే అని నిర్ధారించుకున్నారు.వెంటనే గోడ పగుల గొట్టి ఆ కొండ చిలువను బయటకు తీశారు.

దానిని మళ్లీ జూకు తీసుకెళ్లి ఇంకో మందపాటి ఎన్​క్లోజర్​లో ఉంచారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube