అమెజాన్‌ను ఇండియాలో బ్యాన్‌ చేయాల్సిందే అంటున్న పంజాబీలు... ఇది చదివిన తర్వాత మీరూ అదే మాట అంటారు

కొన్ని రోజుల క్రితం ఇండియా జాతీయ జెండాను విదేశాల్లో హ్యాండ్‌ కర్చిఫ్‌ుగా అమ్మిన అమెజాన్‌ వరుసగా ఏదో ఒక వివాదానికి తెర లేపుతోంది.చెప్పులపై ప్రముఖ వ్యక్తుల బొమ్మలు వేయడం, ఇంకా పలు రకాల వివాదాస్పద వస్తువులను అమ్మిన అమెజాన్‌ తాజాగా మరో వివాదాస్ప అంశంతో మీడియా ముందుకు వచ్చింది.

 The Punjabi People Wants To Ban The Amazon Products In India-TeluguStop.com

దేశంలోనే అతి ప్రాముఖమైన పంజాబ్‌ అమృత్‌సర్‌ గోల్డెన్‌ టెంపుల్‌ బొమ్మలను టాయిలెట్‌ షీట్స్‌ పై ముద్రించి అమ్ముతున్నారు.


టాయిలెట్‌ షీట్స్‌ పై అమృత్‌సర్‌ గోల్డెన్‌ టెంపుల్‌ బొమ్మలు ఉండటంతో పంజాబ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.ముఖ్యంగా పంజాబ్‌ లోని అమెజాన్‌ ఆఫీస్‌ ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఇండియాకు చెందిన ప్రముఖులను మరియు ప్రముఖ ప్రదేశాలను పదే పదే అవమానిస్తూ, ఇండియన్స్‌ పరువు తీస్తూ, ఇండియన్స్‌ మనో భావాలను దెబ్బతీస్తున్న అమెజాన్‌ను ఇండియాలో బ్యాన్‌ చేయాలంటూ తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు.


అమెజాన్‌ను ఇండియాలో బ్యాన్‌ చేసే వరకు తమ ఆందోళనలు ఆగవని అంటున్నారు.పంజాబ్‌ వారు మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో ఈ వ్యవహారం తారా స్థాయికి చేరడంతో పెద్ద ఎత్తున అమెజాన్‌కు వ్యతిరేకంగా క్యాంపెయినింగ్‌ జరుగుతుంది.అమెజాన్‌ను బ్యాన్‌ చేయాల్సిందే అంటూ నెటిజన్స్‌ కూడా డిమాండ్‌ చేస్తున్నారు.ఇప్పటికే అమెజాన్‌ ఆ ప్రాడెక్ట్స్‌ను తీసేయగా, జనాలు మాత్రం ఒప్పుకోవడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube