ప్రొఫిసర్ కంప్యూటర్ ని హ్యాక్ చేసిన భారత సంతతి వ్యక్తి..       2018-07-06   01:05:29  IST  Bhanu C

అమెరికాలో భారత సంతతి విద్యార్థి చేసిన పని అమెరికా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది..ఆ విద్యార్థి ఏకంగా తన ప్రొఫిసర్ కంప్యూటర్ నే హ్యాక్ చేశాడు.. దాంతో యూనివర్సిటీ మొత్తం షాక్ కి గురయ్యింది.. ఇంతకీ అతను ఏమి చేశాడు అనే వివరాలలోకి వెళ్తే…

సహజంగా..పిల్లలని..చదువుకోవాలని తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తూ ఉంటారు..అలాంటి సమయంలో ఏమి చేయాలో తెలియక మార్కులు తక్కువ వస్తున్నాయని భయపడే పిల్లలు ఉన్నారు కొంతమందు…బలవన్మరణాలకు..పాల్పడితే.. మరికొందరు..ఇళ్ళల్లోనుంచి…పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి…అయితే భారత సంతతి విద్యార్థి అయిన వరుణ్‌.సార్జా అనే యువకుడు..అమెరికాలో..కాన్సాస్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లో చేరాడు..

అయితే మొదటి సంవత్సరం మార్కులు తక్కువగా వస్తున్నాయి అనే ఉద్దేశ్యం తో తల్లిదండ్రులు తిడుతారని భావించిన అతడు అడ్డదారి తొక్కాడు. కీస్ట్రోక్‌ లాగర్‌ అనే హ్యాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి తన గణితం ప్రొఫెసర్‌ కంప్యూటర్‌ను హ్యాక్‌ చేశాడు..ఆ తరువాత పరీక్షల్లో తనకు వచ్చిన ‘ఎఫ్‌’ గ్రేడ్‌ను ‘ఏ’ గ్రేడ్‌గా మార్చుకున్నాడు. ఇదే తరహాలో మిగిలిన 9 సబ్జెక్టుల్లోనూ ఏ గ్రేడ్‌ వచ్చినట్లు హ్యాక్‌ చేయగలిగాడు.

అయితే లెక్కల్లో ఎప్పుడూ మంచి మార్కులు రావని..గ్రహించిన…అకడమిక్‌..అడ్వైజర్‌కు అనుమానం వచ్చి మార్కుల్ని తనిఖీ చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సార్జాకు పై పోలీసులకి ఫిర్యాదు చేశాడు.. దాంతో అక్కడి కోర్టు 18 నెలల జైలుశిక్ష విధించింది.