బాలయ్యకు అంత సీన్‌ లేదని తేల్చేసిన 'రూలర్‌' నిర్మాత

నందమూరి బాలకృష్ణ వరుసగా ఫ్లాప్‌ సినిమాలే చేస్తున్నాడు.ఎంతో కష్టపడి చేసిన ఎన్టీఆర్‌ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద చాలా దారుణమైన పరాజయం పాలయ్యింది.

 The Producerclarifiesabout Balakrishna Ruler Movieremuneration-TeluguStop.com

తన సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నా కూడా యంగ్‌ హీరోలు పారితోషికాలు పెంచుతున్నారనే ఉద్దేశ్యంతో తన పారితోషికంను కూడా చాలా పెంచాడు అంటూ ఆమద్య మీడియాలో వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న రూలర్‌ చిత్రానికి గాను ఆయన కెరీర్‌ లో రికార్డు స్థాయి పారితోషికం తీసుకుంటున్నాడట.

ఆమద్య ఒక సినిమాకు తీసుకున్న పారితోషికంకు ఇది డబుల్‌ అంటూ టాక్‌ వినిపించింది.ఏకంగా 10 కోట్ల వరకు డిమాండ్‌ చేశాడనే కామెంట్స్‌ కూడా వచ్చాయి.అయితే బాలయ్య పారితోషికం విషయంలో రూలర్‌ నిర్మాత క్లారిటీ ఇచ్చాడు.అవిన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ తేల్చి పారేశాడు.

Telugu Balakrishna, Ks Ravi Kumar, Ruler-

బాలయ్య పారితోషికం విషయంలో అస్సలు పట్టించుకోడని, ఒక మంచి సినిమాను తీసేందుకు ఆయన నిర్మాతకు ఎప్పుడు సహకారం అందిస్తాడని అందుకే ఆయన ఒక స్టార్‌ అయ్యాడు అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు.అంతా ఇంత అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అంత సీన్‌ అస్సలు లేదు.బాలయ్య పారితోషికం ప్రచారం జరుగుతున్న దానికి చాలా తక్కువ అని ఆయన నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు అంటూ ఆయన పారితోషికం విషయంలో సి కళ్యాణ్‌ క్లారిటీ ఇచ్చాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube