ఉప్పు ఎక్కువ తింటున్నారా ? మీ శరీరంలో జరిగే దారుణాలు ఇవే  

The Problems Of Eating Too Much Salt-

ఇంట్లో ఒక కూర వండుతారు. దాదాపుగా అందరికి కూర పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. కాని ఒక్కరు ఉంటారు..

ఉప్పు ఎక్కువ తింటున్నారా ? మీ శరీరంలో జరిగే దారుణాలు ఇవే-

వారికి ఉప్పు సరిపోదు. ఇంకా ఉప్పు కావాలంటారు. ప్రతి ఇంట్లో ఇలాంటోళ్ళు ఒకరైనా ఉంటారు.

మరి అది మంచి అలవాటా? ఉప్పు అవసరానికి మించి తింటే ఏమవుతుంది ? అసలు రోజుకి ఎంత ఉప్పు సరిపోతుంది ? నిజానికైతే రోజుకి కేవలం 1500 మిల్లి గ్రాముల సరిపోతుంది. అదే అప్పర్ లిమిట్ అనుకోవచ్చు. అంతకంటే ఎక్కువ ఉప్పు మన శరీరానికి అవసరం లేదు. అయినా ఉప్పు మనం తింటున్నామా అని అనుకుంటున్నారేమో … ఉదయం టిఫిన్ లో చట్నీలో ఉప్పు ఉంటుంది, రెండుపూటలా కూరలో ఉంటుంది, మధ్యలో తినే పిండివంటల్లో ఉంటుంది. ఇలా ప్రపంచంలో అత్యధికంగా ఉప్పు తింటున్న దేశంగా నిలిచింది భారతదేశం.

భారతీయులు అవసరానికి మించి తింటున్నారు మనవారు. అది ఎందుకు మంచి అలవాటు కాదో చూడండి.* ఎక్కువగా ఉప్పు తినడం వలన బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోతుంది.

దాంతో రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి వలన రక్తనాళాలు బిగుసుకుపోయి, బ్లడ్ ప్రెషర్ ఇంకా పెరిగిపోతుంది. అలా జరినప్పుడు మన రక్తం ద్వారా శరీర భాగాలకు అందే ఆక్సిజన్ లెవల్స్, న్యూట్రింట్స్ తగ్గుతాయి.

దాంతో శరీరం మొత్తానికి నష్టమే.* అధికంగా ఉప్పు తినడం మన మెదడుకి అస్సలు మంచిది కాదు. ఎందుకు అని మీరంటారు.

బ్లడ్ ప్రెషర్ వలన మెదడుకి ఆక్సిజన్ లెవల్స్ సరిగా అందవు. ఎలాంటి న్యూట్రింట్స్ అందని స్థితికి కూడా పడిపోవచ్చు. సమస్య నార్మల్ గా ఉంటే ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి తగ్గుతుంది.

అదే తీవ్రమైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మెదడు ఆగిపోతుంది.

కిడ్నీలు మన ఒంట్లోని మలీనాలని మూత్రం రూపంలో బయటకి పంపిస్తుంది అని మనకు తెలిసిందే. సోడియం లెవల్స్ పెరిగినప్పుడు నీటిని (మూత్రాన్ని) పూర్తిగా బయటకి తోయలేవు కిడ్నీలు. దాంతో ఒంట్లో నీటి శాతం పెరిగిపోతుంది.

ఒళ్ళు ఉబ్బిపోతుంది. కిద్నీలపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దాంతో అవి మెల్లిమెల్లిగా పనిచేయడం తగ్గిస్తాయి.

కిడ్నీల్లో రాళ్ళు రావొచ్చు, కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కూడా అవొచ్చు.* ఉప్పు ఎక్కువగా తినడం వలన సోడియం లెవల్స్ పెరిగిపోతాయని చెప్పాంగా. ఈ సోడియం లెవల్స్ పెరగటం వలన కడుపులో అల్సర్స్ వస్తాయి.

కొన్నిసార్లు హై సోడియం లెవల్స్ క్యాన్సర్ కి కూడా కారణం కావొచ్చు.* శరీరం ఊరికే అలసిపోతుంది. ఎందుకంటే సోడియం లెవల్స్ వలన డీహైడ్రీషన్ అనేది చాలా కామాన్.

మాటిమాటికి నీళ్ళు తాగాలి అనిపిస్తుంది. ఎందుకంటే సోడియం ప్రభావం తగ్గాలి కదా.* ఇవి కాకుండా, తరచుగా మోషన్స్ అవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నరాల బలహీనత లాంటివి అదనం.