ప్రతిపక్షాల కంటే ఎక్కువగా .. జగన్ పై వీరి బాధేంటో ?

ఏపీలో చిత్ర విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొంది.ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఇంకా బలహీనంగానే ఉండడం, జనసేన, బీజేపీ పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడం వంటివి అధికార పార్టీ వైసీపీ కి బాగా కలిసి వస్తున్నాయి.

 The Pro Tdp Media Fighting The Ycp Government As The Main Opposition In The Ap,-TeluguStop.com

ఉన్నంతలో టిడిపి, వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది.కొంతమంది మంత్రులు జగన్ ను పూర్తిగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తోంది.

ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతోందని, ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా, ఎంతగా అరిచి గగ్గోలు పెడుతున్న ప్రయోజనం అయితే కనిపించడం లేదు.దీనికి కారణం గత టిడిపి ప్రభుత్వంలో లెక్కకు మిక్కిలిగా అవినీతి వ్యవహారాలు చోటుచేసుకున్నట్లు కొన్ని ఆధారాలతో సహా బయటకు రావడం, గత ప్రభుత్వ పాలనకు విసిగిపోయి జగన్ కు ఈ స్థాయిలో సీట్లు దక్కేలా చేయడం , ప్రతిపక్షాలు అన్న తర్వాత ఈ విధంగానే విమర్శలు చేస్తాయనే ఒక రకమైన అభిప్రాయం కలగడంతోనే వైసిపి కి పెద్దగా ఇబ్బందులు లేకుండా ఉంది.

దీనికి తోడు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలవుతూ ఉండటం వంటివి ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా కనపడకుండా చేస్తున్నాయి.అయితే ప్రతిపక్షాలు ఈ విషయంలో విఫలం అవడంతో ఇప్పుడు ఆ బాధ్యతను టీడీపీ అనుకూల మీడియా గా పేరు పొందిన కొన్ని పత్రికలు, చానళ్ళు తీసుకున్నాయి.

వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిపోతుందని, అప్పులు కేవలం ఏపీ ప్రభుత్వం మాత్రమే చేస్తోంది అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నాయి.కేంద్రం, ఏపీ ప్రభుత్వ తీరుతో విసుగుపోయిందని ఇలా ఎన్నో రకాలుగా ప్రచారం మొదలుపెట్టాయి.

ఒక దశలో ప్రధాన ప్రతిపక్షం గా టీడీపీ అనుకూల మీడియా  వ్యవహరిస్తోంది.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan, Tdp, Ysrcp-Telug

ఏపీలో టిడిపి విమర్శలను నమ్మే పరిస్థితి లేకపోవడం, జనసేన, బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగా ఉండడం తదితర కారణాలతో ప్రతిపక్ష బాధ్యతను తామే తీసుకున్నట్లు వ్యవహరిస్తోంది.గత టిడిపి ప్రభుత్వంలో చేసిన అప్పులను, అవినీతి వ్యవహారాలను ప్రస్తావించకుండా కేవలం జగన్ ప్రభుత్వ హయాంలో మాత్రమే ఈ అప్పులు, వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయనే విధంగా కథనాలు ప్రచారం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.అది కాకుండా వ్యక్తిగతంగా చేపట్టిన చిన్న చిన్న సర్వేలను హైలెట్ చేసి ఏపీ ప్రభుత్వంపై జనాల్లో ఆదరణ తగ్గిందనే విధంగా తమ కథనాల ద్వారా ప్రచారం చేస్తుండడం, వైసీపీ వ్యతిరేకులు కామెంట్స్  కు ప్రాధాన్యం ఎక్కువ కల్పించడం తదితర అంశాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube