ఈ 'టీ' ధర తెలిస్తే ఆమ్మో అనాల్సిందే !  

  • పొద్దు పొద్దున్నే ఓ కప్పుడు వేడి వేడి టీ తాగందే చాలామందికి రోజు మొదలవ్వదు. నిత్యజీవితంలో భాగంగా మారిన టీలో ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రేఖారాఖల టీలు ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు సరి కొత్త రుచులతో కొత్త కొత్త టీ లు పుట్టుకొస్తున్నాయి.

  • The Price Of Tea Leaves Is Very Expensive-

    The Price Of Tea Leaves Is Very Expensive

  • తాజాగా మార్కెట్‌లోకి కొత్త తరహా టీ ఆకులు ప్రవేశించాయి. దీని ధర ఎంతో తెలిస్తే షాకవడం ఖాయం. ఈ టీ ఆకుల ధర కిలో రూ. 24,501. ఈ టీ అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలో ఈ టీఆకులు లభ్యమవుతాయి. ఈ టీ చూసేందుకు వంకాయి రంగులో కనిపిస్తుంది. చాయ్ మీద పరిశోధనలు చేసే ఒక సంస్థ ఈ తేనీరుకు గల చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేసింది. తొలుత ఈ చాయ్‌ని కీనియాలో వినియోగించారని తెలుస్తోంది. ఈ అలవాటు అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు వచ్చినట్లు సమాచారం.

  • The Price Of Tea Leaves Is Very Expensive-
  • ఈ చాయ్ రిచ్ క్వాలిటీతో కూడి ఉంటుంది. కాగా ఈ చాయ్ క్యాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కాపాడుతుందని తెలుస్తోంది. కాగా ఈ తేయాకును అడవుల్లోనే పండించి తీసుకువస్తారని తెలుస్తోంది. గతంలో ఈ టీ రూ. 15,000 ఉండగా, ఇప్పుడు మరింత ప్రియం అయ్యింది.